Saturday, March 14, 2026
HomeTop StoriesDubai: పశ్చిమాసియాలో హైటెన్షన్.. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ దాడి!

Dubai: పశ్చిమాసియాలో హైటెన్షన్.. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ దాడి!

Iran drone attack: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు తాజాగా తీవ్రరూపం దాల్చాయి. దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

- Advertisement -

భారీ ఎత్తున మంటలు: అమెరికా కాన్సులేట్‌లోని పార్కింగ్ ప్రాంతంలో ఈ డ్రోన్ దాడి జరిగినట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధృవీకరించారు. దాడి జరిగిన వెంటనే అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. కాన్సులేట్‌లోని అమెరికా దౌత్య సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాఖ ప్రకటించింది.

Also read-Flight Services: యుద్ధం ఎఫెక్ట్‌తో విమాన సర్వీసుల బంద్‌.. ఆ మార్గాల్లో ఫ్లైట్‌ ఛార్జీల మోత.!

పెరుగుతున్న ఘర్షణలు: ఇరాన్‌పై దాడులు జరిగినప్పటి నుండి ప్రతికార చర్యలు ఉంటాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఈ డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా రక్షణ దళాలు ఇప్పటికే అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News