Europe Tour 2026: యూరప్ చూడాలి అన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది, ప్లానింగ్ కష్టం అనిపిస్తుంది, వీసా ట్రావెల్ హోటల్స్ అన్నీ ఎలా మేనేజ్ చేయాలి అనే సందేహాలు వస్తుంటాయి. అలాంటి వాళ్ల కోసం భారత ప్రభుత్వ టూరిజం విభాగమైన IRCTC ఇప్పుడు తీసుకొచ్చిన స్పెషల్ ప్యాకేజ్ “క్యూకెన్‌హోఫ్ స్పెషల్ గ్లింప్సెస్ ఆఫ్ యూరప్”. ఈ ఒక్క ప్యాకేజ్‌తోనే యూరప్‌లోని టాప్ నగరాలు చూసే ఛాన్స్ వస్తుంది. ఫ్లైట్ నుంచి హోటల్ వరకు, లోకల్ ట్రావెల్ నుంచి సైట్ సీయింగ్ వరకు అన్నీ ముందే ప్లాన్ చేసి ఇస్తారు. మన పని బ్యాగ్ సర్దుకుని ట్రిప్ ఎంజాయ్ చేయడమే.
మొత్తం 12 నైట్స్ 13 డేస్
ఈ టూర్ మొత్తం 12 నైట్స్ 13 డేస్ ఉంటుంది. ముంబయి నుంచి డిపార్చర్ డేట్ 26-04-2026. ఒక్కొక్కరికి ప్యాకేజ్ ధర రూ.4,13,000 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలోనే ఫ్లైట్ టికెట్స్, హోటల్ స్టే, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, టూర్ గైడ్, లోకల్ ట్రాన్స్‌పోర్ట్, ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. అంటే విడిగా ఏదీ బుక్ చేయాల్సిన అవసరం లేదు.
జర్నీ మొదలయ్యేది ఫ్రాన్స్ నుంచి
ఈ జర్నీ మొదలయ్యేది ఫ్రాన్స్ రాజధాని పారిస్ (Paris) నుంచి. అక్కడ ప్రపంచ ప్రసిద్ధ ఐఫిల్ టవర్ చుట్టూ నైట్ వ్యూ, సిటీ టూర్, క్లాసిక్ యూరోపియన్ స్ట్రీట్స్ చూసే అవకాశం ఉంటుంది. పారిస్‌లో ప్రతి మూల ఒక ఫోటో ఫ్రేమ్‌లా కనిపిస్తుంది. అక్కడి తర్వాత బెల్జియంలోని బ్రస్సెల్స్ (Brussels) చేరుకుంటారు. బ్రస్సెల్స్‌లో గ్రాండ్ ప్లేస్ లాంటి హిస్టారికల్ ఏరియాలు, యూరోపియన్ ఆర్కిటెక్చర్ చూస్తే నిజంగా వావ్ అనాల్సిందే.
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్
తర్వాత నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్ (Amsterdam). ఆమ్‌స్టర్‌డామ్ అంటే కెనాల్స్, బోట్ రైడ్స్, కలర్‌ఫుల్ స్ట్రీట్స్. ఇదే ట్రిప్‌లో ప్రధాన హైలైట్ అయిన క్యూకెన్‌హోఫ్ గార్డెన్ కూడా ఉంటుంది. లక్షల సంఖ్యలో ట్యూలిప్ పూలతో కనిపించే ఆ గార్డెన్ ఈ సీజన్‌లో నిజంగా స్వర్గంలా ఉంటుంది. ప్రతి కలర్ పువ్వు, ప్రతి డిజైన్ చేసిన ల్యాండ్‌స్కేప్ మనసు నిండా ఫీల్ ఇస్తుంది. అక్కడి నుంచి జర్మనీలోని Cologne వెళ్తారు. కోలొన్ కేథడ్రల్ ముందు నిలబడ్డప్పుడు యూరప్ చరిత్ర మన కళ్ల ముందే కనిపించినట్టు ఉంటుంది. తర్వాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ (Zurich). జ్యూరిచ్ అంటే ఆల్ప్స్ పర్వతాల నేపథ్యం, క్లియర్ లేక్ వ్యూస్, సూపర్ క్లీన్ రోడ్స్. అక్కడి నేచర్ బ్యూటీ చూస్తే నిజంగా మాటలు రావు.
ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్
అనంతరం ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్ (Innsbruck). ఇన్స్‌బ్రుక్ చిన్న పట్టణంలా కనిపించినా చుట్టూ ఉన్న పర్వతాలు, కలర్‌ఫుల్ హౌసెస్ ఆ ప్లేస్‌కి స్పెషల్ లుక్ ఇస్తాయి. అక్కడి నుంచి ఇటలీకి ఎంట్రీ. ముందుగా వెనిస్ (Venice). వెనిస్‌లో రోడ్స్ ఉండవు, నీళ్ల మీదే ట్రావెల్. గోండోలా బోట్ రైడ్ ఒక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత పిసా (Pisa)లో లీనింగ్ టవర్ దగ్గర ఫోటోలు, ఫ్లోరెన్స్ (Florence)లో రేనెసాన్స్ ఆర్ట్ సిటీ వైబ్, రోమ్ (Rome)లో ప్రాచీన రోమన్ చరిత్ర, చివరగా మిలన్ (Milan)లో మోడ్రన్ యూరప్ లైఫ్‌స్టైల్ చూసే అవకాశం ఈ ప్యాకేజ్‌లో ఉంటుంది.
అందరికీ ఇది పర్ఫెక్ట్ ప్యాకేజ్
ఇది గ్రూప్ టూర్ కావడం వల్ల ఫస్ట్ టైమ్ యూరప్ వెళ్లేవాళ్లకి చాలా సేఫ్ ఆప్షన్. భాష సమస్య ఉండదు, ప్రతి ప్లేస్‌కి గైడ్ ఉంటారు, హోటల్స్ ముందే బుక్ అయి ఉంటాయి. కుటుంబంతో వెళ్లాలనుకునే వాళ్లు, హనీమూన్ ప్లాన్ చేస్తున్న జంటలు, ఫ్రెండ్స్ ట్రిప్ అనుకునే వాళ్లు అందరికీ ఇది పర్ఫెక్ట్ ప్యాకేజ్. ముఖ్యంగా గవర్నమెంట్ బ్యాక్డ్ సంస్థ ఇస్తున్న టూర్ కావడంతో నమ్మకంగా బుక్ చేసుకోవచ్చు.
ప్యాకేజీ వివరాలు..
ఇప్పుడు అసలు పాయింట్ మళ్లీ చెప్తా. యూరప్ ట్రిప్ అంటే సాధారణంగా చాలా లక్షలు ఖర్చు అవుతాయి. కానీ ఇక్కడ రూ.4,13,000 నుంచే 12 నైట్స్ 13 డేస్ యూరప్ జర్నీ అంటే నిజంగా గ్రేట్ డీల్. ఒక్క ట్రిప్‌లో ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ దేశాలు కవర్ అవుతాయి. క్యూకెన్‌హోఫ్ పూల సీజన్‌లో ట్రావెల్ చేయడం అంటే లైఫ్‌లో మర్చిపోలేని మెమరీగా మారుతుంది.
ఎవరిని సంప్రదించాలి
యూరప్ చూడాలి అన్న కల ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ ఛాన్స్. సీట్లు లిమిటెడ్‌గా ఉంటాయి కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. ఈ టూర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కాల్ లేదా వాట్సాప్ 8287931886 నంబర్‌ని సంప్రదించండి. అలాగే అధికారిక వెబ్‌సైట్ irctctourism.com లో కూడా బుకింగ్ అవకాశం ఉంది. మీ యూరప్ డ్రీమ్ ట్రిప్‌ని ఇప్పుడు నిజం చేసుకునే టైమ్ ఇదే.

