Wednesday, July 16, 2025
Homeఇంటర్నేషనల్Trump: ట్రంప్‌కు ఇరాన్ హ్యాకర్ల బిగ్ వార్నింగ్.. ఆ డేటా అంతా హ్యాక్

Trump: ట్రంప్‌కు ఇరాన్ హ్యాకర్ల బిగ్ వార్నింగ్.. ఆ డేటా అంతా హ్యాక్

Iron Hackers: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా సైతం పాల్గొని ఇరాన్‌లోని పలు అణు స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ హ్యాకర్ల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ట్రంప్ సన్నిహితుల నుంచి హ్యాక్ చేసిన మెయిల్స్‌ను బహిర్గతం చేస్తామని ఇరాన్ హ్యాకర్లు తెలిపారు. ఈ మేరకు రాబర్ట్ అనే పేరుతో ఏ మీడియా సంస్థతో వారు సంభాషించారు. ఆ సంభాషణలో పలు కీలకమైన విషయాలను వెల్లడించినట్లు పలు నివేదికలు వెలువడ్డాయి.

- Advertisement -

ఆ నివేదికలోని వివరాల ప్రకారం, ట్రంప్‌కు దగ్గరగా ఉన్న వైట్ హౌస్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్, న్యాయవాది లిండ్సే హాలిగన్, రాజకీయ సలహాదారు రోజర్ స్టోన్ వంటి ప్రముఖుల మెయిళ్లు ఈ హ్యాకింగ్‌లో చోరీ చేయబడ్డాయని తేలింది. దాదాపు 100 GB డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు చెప్పారు. ఆ డేటాను విక్రయించే అవకాశం ఉందని చెప్పారు. కానీ, ఎలా, ఎప్పుడు బహిర్గతం చేస్తారన్న దానిపై వివరాలు వెల్లడించలేదు. అలాగే ఆ మెయిల్స్‌లో ఉన్న కంటెంట్‌పై కూడా స్పష్టత ఇవ్వలేదు.

ఈ విషయంపై అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థ తీవ్రంగా స్పందించింది. వైట్ హౌస్ మరియు ఎఫ్‌బీఐ ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించాయని, భద్రతకు హానికరంగా వ్యవహరించే ఏ వ్యక్తిని అయినా చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అయితే దీనిపై అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే విధంగా, ఇరాన్ యుఎన్ ప్రతినిధి కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు.

గతంలో జరిగిన పరిణామాలు

ఈ ‘రాబర్ట్’ అనే హ్యాకింగ్ గ్రూప్ పేరు మొదటిగా 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయాల్లో బయటకు వచ్చింది. అప్పట్లోనే ట్రంప్‌కు సన్నిహితులైన వ్యక్తుల మెయిల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం వచ్చింది. అమెరికా న్యాయ శాఖ గతంలో ఈ హ్యాకింగ్ కార్యకలాపాలకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మద్దతు ఇస్తున్నట్టు ఆరోపించింది. ఒకానొక ఇంటర్వ్యూలో, ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే, తమ లీక్స్‌ను ఆపుతామని హ్యాకర్లు తెలిపారు. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ గ్రూప్ తిరిగి కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా, టెహ్రాన్ అణు కేంద్రాలపై జరిపిన దాడుల తర్వాత ఈ సైబర్ ప్రతీకార చర్యలు ప్రారంభమైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడిన ‘రాబర్ట్’ గ్రూప్ సభ్యులు, తమ వద్ద ఉన్న డేటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, కొనుగోలుదారులెవరు అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News