Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Pakistan: కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన దార్..!

Pakistan: కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చిన దార్..!

Ishaq Dar: పాకిస్థాన్‌ తన 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఈ రోజు (ఆగస్టు 14) ఘనంగా జరుపుకుంటుంది. ఈ తరుణంలో, దేశ ఉప ప్రధాని మరియు విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మరలా కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా కూడా, పాకిస్థాన్‌ మాత్రం తన వైఖరిని మార్చుకోవడానికే సిద్ధంగా లేదు.

- Advertisement -

పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇషాక్ దార్ ఓ ప్రకటన విడుదల చేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థానీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా దార్శనికతను స్మరించుకున్న దార్, గత 78 ఏళ్లలో పాకిస్థాన్‌  అద్భుతమైన పురోగతి సాధించిందని వ్యాఖ్యానించారు.

Read more: https://teluguprabha.net/international-news/british-army-kenya-misconduct-scandal/

పాకిస్తాన్ సైనికులు భారత్ చట్టవిరుద్ధమైన చర్యలను నైతికంగా విజయం సాధించామని, దీనిని “మార్కా-ఎ-హక్” విజయంగా దార్ వర్ణించాడు. “కశ్మీర్ అంశం న్యాయబద్ధమైంది. కశ్మీరీ ప్రజల హక్కులు విడదీయరానివి. వారికి న్యాయం జరిగే వరకు మా మద్దతు కొన‌సాగుతుంది” అని దార్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయంగా నిందల పరంపర కొనసాగుతున్నా, దార్ ప్రకటనలో పహల్గామ్ ఉగ్రదాడిపై ఏ మాత్రం సానుభూతి లేదు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఈ దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత్ ఈ దాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని తేల్చి చెప్పింది. అయినా కూడా, పాకిస్థాన్ ప్రభుత్వం ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటూ, ఉగ్రవాదంపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు.

Read more: https://teluguprabha.net/international-news/us-is-now-the-tariff-king-of-the-world-says-former-diplomat-vikas-swarup/

ఈ పరిస్థితుల్లో, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్‌ కి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, పాకిస్థాన్‌ సహకారాన్ని అభినందించడం విమర్శలకు దారి తీసింది. ఉగ్రవాద నిరోధం, వాణిజ్య రంగాల్లో పాక్ చేసిన సహకారం ప్రశంసనీయమని ఆయన పేర్కొనడం పట్ల భారత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad