జపాన్ మాజీ ప్రధాని షింజో ఏబ్ దారుణ హత్య జరిగి ఏడాది కూడా కాకముందే ప్రస్తుత ప్రధానిపై దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా జపాన్ వణికిపోతోంది. జపాన్ ప్రస్తుత ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రసంగిస్తుండగా ఆయనపై బాంబు దాడి జరిగింది. వకయామాలో ఈ దాడి జరుగగా ఆయన తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. కాగా నిందితులను స్పాట్ లోనే పట్టుకున్నారు.
- Advertisement -
జపనీయులంటే శాంతి ప్రేమికులు, సాధారణంగా ఆ దేశంలో ఇలాంటివి చాలా తక్కువగా చోటుచేసుకుంటాయి. కానీ పదేపదే ఇలా రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడి జపనీయులను ఉలిక్కిపడేలా చేస్తోంది.