Jinping:సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి నేటి కాలంలో 150 ఏళ్ల వరకు జీవించవచ్చని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన కామెంట్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మద్దతు పలికారు. అవునంటూ మాటలో మాట కలిపారు. బుధవారం చైనాలో జరిగిన సైనక కవాతు, యుద్ధ విమానాల ప్రదర్శన సందర్భంగా వీరి మధ్య ఈ సంభాషణ జరిగింది. ప్రస్తుతం వీరి చర్చ హాట్ టాపిక్‌గా మారింది.
జిన్‌పింగ్ చైనాను సందర్శించిన పుతిన్, నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌లతో ఈ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కాగా, పుతిన్, జిన్‌పింగ్‌ల వయసు 72 సంవత్సరాలు.
ఇంతకీ ఆయనేమన్నారంటే.. ‘70 ఏళ్లకు పైబడి జీవించడం అరుదుగా ఉండేది. కానీ ఈ మోడరన్ రోజుల్లో 70 ఏళ్లంటే నువ్వింకా చిన్న పిల్లాడివే. అభివృద్ధి చెందుతున్న బయోటెక్నాలజీ, మానవ అవయావాలు నిరంతరం ట్రాన్స్‌ప్లాంట్ చేయవచ్చు. దీని వల్ల మనిషి వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా మారవచ్చు. అసలు చావనేదే కూడా దరి చేరకపోవచ్చు. ఈ కాలంలో (శతాబ్దంలోనే) మనిషి 150 ఏళ్లు బతికే అవకాశముంది’ అని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు.
అయితే ఇది జిన్‌పింగ్, పుతిన్, కిమ్‌ల మధ్య జరిగిన చిట్‌చాట్… కాగా దీన్ని పుతిన్ సైతం మీడియాతో మాట్లాడినప్పుడు నిర్ధారించారు. తాము సైనిక కవాతుకు వెళ్లే సమయంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
జిన్‌పింగ్ చైనా అధికారిక భాష మాండరిన్‌లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో మనిషి ఆయుర్ధాయంపై చర్చ మొదలైంది.
‘జిన్‌పింగ్ చెప్పిన మోడరన్ అంటే ఆరోగ్యపరంగా, వైద్యపరంగా వస్తున్న మార్పులు అని అర్థం. మానవ అవయావాల మార్పిడి వంటి అంశాల్లో చాలా మార్పులు వచ్చాయి. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ రేపటి రోజున విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయనిపిస్తోంది’ అని పుతిన్ అన్నారు.
నిజానికి పుతిన్ ఆయుర్దాయం (జీవనకాలం పెరుగుదల)పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. రష్యాలో జీవన ప్రమాణాల పెరుగుదలకు జరిగే పరిశోధనలకు ప్రోత్సహాలు కల్పిస్తున్నారు.
అయితే, కాలంతోపాటే మనిషి మెదకు, ఇతర అవయావాలు కృశించిపోవడం అనేది సాధారణమని అవయావాల మార్పిడి (హ్యూమన్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్) వల్ల వృద్ధాప్యాన్ని నియంత్రించలేమని నిపుణులు చెబుతున్నారు.
కాగా, చైనా అధ్యక్షుడిగా బతికున్నన్ని రోజులు తానే కొనసాగేలా జిన్‌పింగ్ చట్ట సవరణ చేయించారు. పుతిన్ సైతం రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగేలా రాజ్యాంగపరమైన సవరణలు చేయించుకున్నారు. ఇద్దరూ అధికారం నిలబెట్టుకునేందుకు ఎంతవరకైనా వెళ్తారనే పేరుంది. ఇప్పుడు 150 ఏళ్ల వరకు జీవింవచ్చనే చర్చ కూడా వారి అధికార కాంక్షను తెలియజేస్తోందని విమర్శలు నిందిస్తున్నారు.


