Homeఇంటర్నేషనల్Joe Biden: బైడెన్ తలపై పెద్ద గాటు.. తీవ్ర ఆందోళనలో అభిమానులు.. అసలేమైంది?

Joe Biden: బైడెన్ తలపై పెద్ద గాటు.. తీవ్ర ఆందోళనలో అభిమానులు.. అసలేమైంది?

Joe Biden Skin Cancer Surgery: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఆయన తలపై పెద్ద గాటు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చకు దారితీసింది. లేబర్ డే వారాంతంలో డెలావేర్‌లోని ఒక చర్చి నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ వీడియో తీశారు. ఆయన ఇటీవలి ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, ఈ తాజా గాటు ఆయన మద్దతుదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

ALSO READ: It May Possible to live to 150 ఏళ్లు బతికేయొచ్చు: జిన్‌పింగ్

సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఈ వీడియోలో, బైడెన్ సందర్శకులకు అభివాదం చేస్తుండగా, ఆయన జుట్టు కింద నుదుటిపై ఎర్రటి గాటు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో తీసిన ఫ్రెడ్ కార్గర్ మాట్లాడుతూ, “ఆ గాటు చూడగానే నేను కొంచెం ఆశ్చర్యపోయాను, అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది,” అని అన్నారు. ఇది ఆయన స్కిన్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిగిన సర్జరీ వల్ల ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ALSO READ: Xi Jinping: డీఎన్ఏ దొక్కుండా.. కిమ్ కూర్చున్న చైర్ ని ఎలా తుడిచారో చూడండి..!

ఈ విషయంపై బైడెన్ వైద్య బృందం స్పష్టత ఇచ్చింది. మాజీ అధ్యక్షుడి తలపై ఉన్న క్యాన్సర్ కణితిని తొలగించేందుకు ‘మోహ్స్ సర్జరీ’ (Mohs surgery) అనే ప్రత్యేకమైన శస్త్రచికిత్స చేశారని ధృవీకరించారు. ఈ విధానంలో క్యాన్సర్ కణాలు పూర్తిగా తొలగిపోయే వరకు పలుచని పొరలుగా కణజాలాన్ని తొలగిస్తారు.

ALSO READ: Vladimir Putin: రాజనీతి అంటే సుంకాలు పెంచడం కాదు ట్రంప్… సమస్యలకు పరిష్కారిచడం!

బైడెన్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. 2023 ప్రారంభంలో ఆయన ఛాతీపై ఉన్న బేసల్ సెల్ కార్సినోమాను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. అంతకుముందు, మే 2025లో తనకు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందని, అది ఎముకలకు కూడా వ్యాపించిందని బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఆయన తలపై తాజా గాటు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.

ALSO READ: UNGA: ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ఐరాసలో భారత్‌ ఆందోళన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News