HomeTop StoriesNepal government: నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆ నోట్లు సైతం చెల్లుబాటు..!

Nepal government: నేపాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆ నోట్లు సైతం చెల్లుబాటు..!

Key decision by the Nepal government: భారత కరెన్సీపై మన పొరుగు దేశమైన నేపాల్‌ కీలక ప్రకటన చేసింది. గతంలో రూ. 100 నోట్లను మాత్రమే అనుమతించిన ఆ దేశం.. ఇకపై భారత్‌కు చెందిన రూ. 200, రూ. 500 నోట్లు సైతం తమ దేశంలో చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నేపాల్‌ రాష్ర్ట బ్యాంక్‌ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో పెద్ద నోట్ల రద్దు అనంతరం కేవలం రూ.100 నోటును మాత్రమే అనుమతించిన నేపాల్‌ ప్రభుత్వం.. ఇక నుంచి 2016 నవంబర్‌ 9 లేదా ఆ తర్వాత జారీ చేసిన రూ.200, రూ.500 భారత కరెన్సీని కూడా అనుమతిస్తామని తెలిపింది. తాజా నిబంధనల ప్రకారం, ఇకపై నేపాల్‌కు కేవలం రూ. 100లోపు విలువ గల నోట్లతో పాటు రూ.200, రూ.500 నోట్లను సైతం తీసుకురావొచ్చు. అంతేకాదు, నేపాల్‌ నుంచి ఆయా నోట్లను భారత్‌కు తీసుకెల్లి వినియోగించుకోవచ్చు. అయితే, ఇలా భారత్‌ నుంచి తీసుకురావడానికి, నేపాల్‌ నుంచి భారత్‌కు తీసుకెళ్లడానికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు పరిమితి విధించింది. దీనివల్ల భారత్‌, నేపాల్‌ సరిహద్దుల్లో నగదు బదిలీ మరింత సులభతరం కానుంది. నేపాలీ జాతీయులకు, భారత పర్యటకులకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన భారత కరెన్సీని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News