ఏపీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఛాంబర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) వెళ్లారు. గంటకు పైగా సాగిన వీరి సమావేశంలో కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చించనట్టుగా తెలుస్తోంది. బడ్జెట్‌లో అభివృద్ది పనులతో పాటు సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు.
అలాగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నికలపైనా వీరి మధ్య చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు సమాచారం. త్వరలో ఖాళీ కాబోతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనకు ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు సమాచారం.