Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Air Pollution : శ్వాస తీసుకోవడమే సాహసం — ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరం ఇదే!

Air Pollution : శ్వాస తీసుకోవడమే సాహసం — ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరం ఇదే!

Air Pollution : మరోసారి ఆ నగరం వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మంగళవారం దట్టమైన పొగమంచు (స్మాగ్) నగరాన్ని కమ్మేసి, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. స్విస్ ఏర్ క్వాలిటీ మానిటర్ ‘IQAir’ ప్రకారం, ఉదయం 9 గంటల సమయంలో AQI (వాయు నాణ్యత సూచిక) 329గా నమోదైంది. ఇది ‘సీవియర్’ స్థాయి, ఆరోగ్యానికి ప్రమాదకరం. ఉదయం 424కి చేరిన AQI, PM2.5 కణాలు 287గా రికార్డయ్యాయి.

- Advertisement -

‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ పత్రిక కథనం ప్రకారం, అల్లామా ఇక్బాల్ టౌన్‌లో AQI 505, ఫౌజీ ఫర్టిలైజర్ వద్ద 525గా ఉంది. ఈ స్థాయిలో గాలి పీల్చడం గుండె జబ్బులు, శ్వాసకోశ క్యాన్సర్, స్ట్రోక్, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ నగరం ఏదో తెలుసా!

ALSO READ: Montha Cyclone: కాసేపట్లో జాతీయ రహాదారులపై భారీ వాహనాలు బంద్‌

లాహోర్‌తో పాటు, కరాచీ 3వ స్థానంలో (AQI 174). పంజాబ్ ప్రావిన్స్‌లో ఫైసలాబాద్ (439), ముల్తాన్ (438) కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పంజాబ్‌లో ప్రజారోగ్య సంక్షోభం నెలకొంది. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇళ్లకే పరిమితం కావాలి. మాస్కులు, ఇండోర్ యాక్టివిటీలు పాటించాలి. ప్రతి ఏటా అక్టోబర్-నవంబర్‌లో పొగమంచు, వాహనాలు, పారిశ్రామిక కాలుష్యం, వ్యవసాయ వ్యర్థాల కాల్చడం వల్ల ఈ విపత్తు పునరావృతమవుతోంది. లాహోర్ ‘గ్యాస్ ఛాంబర్’గా మారింది. ఆర్థిక నష్టం రూ.10,000 కోట్లు, ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్నాయి.

పంజాబ్ ప్రభుత్వం స్కూల్స్ మూసివేసి, ట్రాఫిక్ పరిమితం చేసింది. వ్యవసాయ కాల్చడం నిషేధం, ఇలక్కా ఫ్యాక్టరీలు మూసివేయాలి కానీ, అమలు బలహీనంగా ఉంది. IQAir రిపోర్ట్ ప్రకారం, లాహోర్

2024లో 200 రోజులు ‘అన్‌హెల్తీ’ AQIతో ఉంది. ప్రపంచంలో 100 అత్యంత కాలుష్య నగరాల్లో 5 పాకిస్థాన్‌లోనే. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ బెల్ట్‌లు పెంచాలని నిపుణులు సూచన. ప్రజలు ఇంట్లోనే ఉండి, మాస్కులు ధరించాలి. ఈ సంక్షోభం పాకిస్థాన్ ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలను కుంగదీస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad