లలిత్ మోడీ బిజినెస్ టైకూన్, ఐపీఎల్ సృష్టికర్త, స్క్యామ్ స్టర్ రాహుల్ గాంధీకి గట్టి హెచ్చరికే ఇచ్చారు. మోడీ అనే పేరుంటే వారంతా దొంగలన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆలస్యంగా స్పందించిన లలిత్ మోడీ రాహుల్ పై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించటం విశేషం. దీంతో రాహుల్ గాంధీ సరికొత్త చిక్కులు స్టార్ట్ అయినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసుల్లో చిక్కుకుని 2010 నుంచి విదేశాల్లో ఉంటున్న లలిత్ మోడీ ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేయటం సెన్సేషన్ గా మారింది.
అసలు రాహుల్ చేసిన ఆరోపణలను రాహుల్ స్వయంగా సాక్షాధారాలతో రుజువు చేయాలని లేదంటే పర్యవసానాలను ఎదుర్కోవాల్సిందేనంటూ లలిత్ మోడీ అల్టిమేటం ఇస్తూ ట్వీట్ చేశారు. తనపై ఉన్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని ఒక్కటి కూడా రుజువు కాకపోగా తన మానసపుత్రిక అయిన ఐపీఎల్ 100 బిలియన్ డాలర్స్ కు పైగా వ్యాపారాన్ని చేస్తోందంటూ లలిత్ మోడీ చెప్పుకున్నారు.