Homeఇంటర్నేషనల్Liechtenstein : పేదరికం నుంచి ప్రపంచ శిఖరానికి! ఆ దేశంలో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!

Liechtenstein : పేదరికం నుంచి ప్రపంచ శిఖరానికి! ఆ దేశంలో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!

Liechtenstein Wealth Economy : లిక్టెన్‌స్టెయిన్.. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశం.. కానీ అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. బెంగళూరు నగరం పొడవుకు పావువంతు కూడా లేకుండా 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఈ దేశం, జనాభా కేవలం 40వేలు మాత్రమే. కానీ, 2025లో తలసరి జీడీపీ 2.13 లక్షల డాలర్లు (సుమారు 1.8 కోట్ల రూపాయలు) – ఇది ప్రపంచ టాప్ ర్యాంక్! ఇక్కడ ప్రతి పౌరుడూ కోటీశ్వరుడే. ఉద్యోగాలు జనాభా కంటే ఎక్కువ, నిరుద్యోగ రేటు కేవలం 1.5 శాతం మాత్రమే. రుణాలు ఒక్క రూపాయి కూడా లేవు. ఇలాంటి వెల్త్ ఎకానమీ ఎలా ఏర్పడిందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే!

- Advertisement -

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, ఈ దేశం పేదరికంతో పోరాడింది. ఆల్ప్స్ పర్వతాల మధ్య ఉండటంతో సహజ వనరులు దాదాపు శూన్యం. మంచు కురిసే చల్లని వాతావరణం, రాతి కొండలతో సేద్యం కష్టమయ్యింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, 1921లో కొత్త రాజ్యాంగంతో ప్రారంభమైంది ఈ దేశ ప్రయాణం. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌తో సరిహద్దులు పంచుకుని, స్నేహపూర్వక సంబంధాలు పెంచుకుంది. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ సంపదను సృష్టించింది. నేడు ఇంత ధనిక దేశమైనప్పటికీ ఆర్మీ లేదు, పోలీసులు 300 మంది కానీ నేరాలు మాత్రం శూన్యం. 1997 తర్వాత ఒక్క అరెస్ట్ కూడా జరగలేదు! ఇళ్లకు తాళాలు కూడా వేయరు ఇక్కడ ప్రజలు.

ALSO READ : Mamata Banerjee Amit Shah : ఈసీకు మమతా లేఖ.. ఎక్స్‌లో అమిత్ షా అదిరిపోయే కౌంటర్!

వెల్త్ ఎకానమీ ఎలా సాధ్యమయ్యిందంటే!

ఇక్కడ ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. మాన్యుఫ్యాక్చరింగ్ 42% జీడీపీకి దోహదపడుతుంది. షాన్ నగరంలో తయారయ్యే దంత ఉత్పత్తులు సిరామిక్ క్రౌన్స్, ఫిల్లింగ్స్ దాదాపు 120 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్లకు కస్టమ్ దంతాలు తయారు చేస్తారు. అందుకే  ఈ దేశాన్ని ‘డెంటల్ క్యాపిటల్’ అంటారు. ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్స్, హిల్టీ టూల్స్‌లో పై చేయి సాధించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ 37% ఆదాయం, 400 ఎసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, 11 బ్యాంకులు, 30 ఇన్సూరెన్స్ సంస్థలు, 500 ఐటీ కంపెనీలు ఈ దేశం సొంతం. స్విస్ ఫ్రాంక్ కరెన్సీను ఉపయోగించే ఈ దేశంలో సొంత ఎయిర్‌పోర్ట్ కూడా లేదు – సమీప దేశాల్లో ల్యాండ్ చేసి ఇక్కడికి వస్తారు.

ఇక్కడ మరో స్పెషల్ ఎట్రాక్షన్ టూరిజం. ఇది పెద్ద ఆదాయ మార్గం. వాడుజ్ కోటలు, పైన్ అడవులు, స్కీయింగ్ రిసార్టులు యాత్రికులను ఆకర్షిస్తాయి. 2023లో 1.16 లక్షల మంది సందర్శకులు ఇక్కడకు వచ్చారు. పోస్టల్ స్టాంపులు మరో స్పెషల్ ఎట్రాక్షన్ మారగా 24 క్యారట్ల బంగారం, 3డీ డిజైన్‌లు ఎంతగానో ఆకర్షిస్తాయి. 2025లో సమ్-సెక్స్ మ్యారేజ్ చట్టం అమలు, IMF సభ్యత్వం సాధించింది ఈ దేశం. ఎన్నో ప్రతికూలతను దాటి ఈ చిన్న దేశం అవకాశాలను అందిపుచ్చుకొని, ప్రపంచానికే గర్వకారణంగా నిలిచింది, ప్రతి దేశానికి ప్రేరణగా మారింది!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News