Friday, November 22, 2024
Homeఇంటర్నేషనల్London: ఛీత్కారాలు ఎదుర్కొంటున్న వల్డ్ ఫేమస్ చెఫ్

London: ఛీత్కారాలు ఎదుర్కొంటున్న వల్డ్ ఫేమస్ చెఫ్

చెఫ్ గార్డెన్ రామ్సేకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులున్నాయి. కానీ పాపం సెలబ్రిటీ చెఫ్ రామ్సే ఆయన టైం ఈమధ్య అస్సలు బాలేనట్టుంది. ఓవైపు సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఆయనకు లేటెస్ట్ గా మరో షాక్ తగిలింది. ఏమాత్రం రుచీపచి లేని ఫ్రైస్ కు ఏకంగా ఆయన 797 రూపాయలు వసూలు చేశారంటూ మండిపడుతున్నారు కస్టమర్స్. రామ్సే సొంత రెస్టారెంట్ సవాయ్ గ్రిల్ అనే లండన్ రెస్టారెంట్ లో చాలా తక్కువ క్వాంటిటీ, పైగా ఏమాత్రం టేస్ట్ లేని ఫ్రైస్ ను 8 పౌండ్లు పెట్టి తిన్నట్టు ట్రిప్ అడ్వైజర్ లో ఓ కస్టమర్ ఏకిపారేయటం వైరల్ అవుతోంది. దీంతో వరుసపెట్టి రామ్సే రెస్టారెంట్ లోని మెనూ కార్డ్ ను పోస్ట్ మార్టం చేస్తుండటం విశేషం. చెఫ్ రామ్సే వంటలకు ఫిదా అయ్యి కడుపునిండా తిందామంటే వీళ్లు నిలువు దోపిడీ చేయటమే కాదు ఏమాత్రం రుచి లేని ఆహారాన్ని..అతి చిన్న క్వాంటిటీల్లో ఇచ్చేస్తున్నారంటూ కస్టమర్స్ వరుసపెట్టి నెగటివ్ రివ్యూలు రాసేస్తుండటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News