Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Earthquake: రష్యాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!

Earthquake: రష్యాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ!

Russia Earthquake: రష్యాలోని కామ్చాట్‌స్కీ ద్వీపకల్పం సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ బలమైన భూకంపం కారణంగా అధికారులు తూర్పు తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం వల్ల ఫర్నిచర్, కార్లు, లైట్లు వంటి వస్తువులు తీవ్రంగా వణికిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం: భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్‌స్కీ ప్రాంతానికి తూర్పున 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. దీని తర్వాత 5.8 తీవ్రతతో పలు చోట్ల భూమి కంపించింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ సునామీ ముప్పు పొంచి ఉందని కమ్చాట్‌స్కీ ప్రాంత గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ తెలిపారు. ఈ ప్రాంతంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఆయన ప్రకటించారు.

Also Read:https://teluguprabha.net/international-news/magnitude-7-4-earthquake-strikes-russias-kamchatka/

భూకంపాలకు గురయ్యే ప్రాంతం కామ్చాట్‌స్కీ: రష్యాలోని కామ్చాట్‌స్కీ ద్వీపకల్పం భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నెలలో (సెప్టెంబర్ 2025) ఇప్పటికే ఇది వరుసగా మూడో భూకంపం. సెప్టెంబర్ 15న 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెప్టెంబర్ 13న 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అంతకుముందు జూలై 2025లో కూడా 8.8 మరియు 7.4 తీవ్రతతో రెండు భారీ భూకంపాలు ఈ ప్రాంతాన్ని కుదిపేశాయి.

రింగ్ ఆఫ్ ఫైర్: ఈ ద్వీపకల్పం పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న “రింగ్ ఆఫ్ ఫైర్”లో భాగంగా ఉంది. ఇది ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవించే ప్రాంతం. అందుకే ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Also Read:https://teluguprabha.net/international-news/tragic-boat-accident-in-congo-river-kill-193-raise-allegations-of-government-negligence/

నెల రోజుల వ్యవధిలోనే: ఈ ఏడాది జులై 20న కూడా ఇదే ప్రాంతంలో 8.7 తీవ్రతతో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో నాలుగు మీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాలు తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం: కామ్చాట్‌స్కీ ద్వీపకల్పంలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వందల సంవత్సరాల తర్వాత క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలు కావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వరుస విపత్తులు కామ్చాట్‌స్కీను కుదిపేస్తోంది. క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం ఇటీవల ఆకాశంలోకి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిదను వెదజల్లింది. దట్టమైన బూడిద మేఘాలు అగ్నిపర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలను రాష్ట్ర మీడియా సైతం విడుదల చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad