Miss Universe 2024| ప్రపంచ సుందరిగా డెన్మార్క్ దేశానికి చెందిన విక్బోరియా కెజార్ హెల్విగ్(Victoria Kjaer Theilvig) గెలుపొందారు. మెక్సికో వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో 125 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్(21) విశ్శసుందరి కిరీటం దక్కించుకున్నారు. ఈమేరకు మిస్ యూనివర్స్ 2023 విజేతషెస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు. ఇక నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్ రన్నరప్‌లుగా నిలిచారు. మరోవైపు ఈ పోటీల్లో పాల్గొన్న భారత్ సభ్యురాలు రియా సింఘా టాప్ 5లో కూడా నిలవలేకపోయారు.
విశ్శ సుందరిగా నిలిచిన విక్టోరియాకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విక్టోరియానే కావడం విశేషం. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. వ్యాపారవేత్తగా రాణించడంతో పాటు మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాలపై పోరాటం చేస్తున్నారు. మోడలింగ్‌లో మిస్ డెన్మార్క్‌గా తొలిసారి విజయాన్ని అందుకున్న ఆమె.. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచారు.