గురువారం ఉదయం బ్లాస్టులతో ఉక్రెయిన్ దేశం యావత్తూ దద్దరిల్లేలా చేసింది రష్యా. రష్యన్ మిస్సైళ్లను వరుసబెట్టి ప్రయోగించి, ఉక్రెయిన్ గుండెల్లో భయాన్ని గట్టిగా నాటే ప్రయత్నం చేసింది రష్యన్ ఆర్మీ. ఉక్రెయిన్ రాజధాని క్వివ్ కూడా బాంబుల మోతతో మారుమోగిపోయింది. దీంతో తాగు నీటిని అందరూ ఇళ్లలో పెద్ద ఎత్తున నిలువ ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆకాశ, సముద్ర మార్గాల ద్వారా ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు రష్యా సేనలు దాడి చేసాయి. డ్రోన్స్, మిస్సైళ్లతో రష్యన్ సేనలు శతృదేశాన్ని కలవరపెడుతున్నాయి. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలు, పరిశ్రమలనే రష్యా సేనలు లక్ష్యంగా పెట్టుకుని దెబ్బకొడుతున్నాయి.
Missile bombarding: ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరైన వేళ.. 120 మిస్సైళ్లతో విరుచుకుపడ్డ రష్యా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES