Modi extends wishes to Trump on America Independence Day: నేడు (జులై 4)న అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, అమెరికాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించి స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్, అమెరికా ఇరు దేశాల్లో విరాజిల్లుతున్న ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పరిపాలన, యువశక్తి, ప్రజల అపరిమిత సామర్థ్యాలు ప్రపంచ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే 250 ఏళ్లు కూడా అమెరికా మరింత ముందుకెళ్లాలని, భారత్-అమెరికా భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
On behalf of 1.4 billion Indians, I extend my warmest congratulations to President Trump and the people of the United States on the historic 250th anniversary of your Independence.
India and the United States share more than a strategic partnership. Our shared belief in…
— Narendra Modi (@narendramodi) July 4, 2026
Also read: CM Revanth Reddy: ‘దొర దురహంకారాన్ని మరోసారి బొందపెట్టాల్సిన అససరం ఉంది’

