Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్Modi Vs Putin: అగ్రరాజ్య ఆగ్రహం వేళ.. పుతిన్‌తో ప్రధాని మోదీ మంతనాలు!

Modi Vs Putin: అగ్రరాజ్య ఆగ్రహం వేళ.. పుతిన్‌తో ప్రధాని మోదీ మంతనాలు!

India-Russia strategic partnership: అగ్రరాజ్యం అమెరికా వాణిజ్యపరంగా కస్సుమంటున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో జరిపిన కీలక సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్‌పై అమెరికా కఠిన సుంకాలు విధించిన ఈ తరుణంలో ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య అసలు ఏం చర్చకు వచ్చింది..? ఉక్రెయిన్ యుద్ధం, ద్వైపాక్షిక బంధంపై వారి వైఖరేంటి..? ఈ పరిణామాలు భారత్-రష్యా-అమెరికా సంబంధాలను ఏ మలుపు తిప్పనున్నాయి..? 

- Advertisement -

 అమెరికా కన్నెర్ర.. రష్యాతో చెలిమి : భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటాన్ని కారణంగా చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు భారత్‌పై కఠిన వైఖరి అవలంబించింది. మొదట 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్, ఇటీవల మరో 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించి, మొత్తంగా 50 శాతానికి పెంచారు. ఆగస్టు 7 నుంచి తొలి విడత సుంకాలు అమల్లోకి రాగా, ఆగస్టు 27 నుంచి ఈ అదనపు భారం కూడా మోపనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ చర్యను భారత్ “అన్యాయమైనది, అహేతుకమైనది” అని తీవ్రంగా ఖండించింది. ఈ గంభీరమైన వాతావరణంలో ప్రధాని మోదీ, రష్యాతో స్నేహబంధాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ALSO READ: https://teluguprabha.net/business/8th-pay-commission-faces-record-delay-in-terms-of-reference-tor-notification-check-how-long-previous-pay-commissions-took/

పుతిన్‌తో ఫలప్రదమైన సంభాషణ :ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణ ఎంతో ఫలప్రదంగా సాగిందని, ఇరు దేశాల మధ్య ప్రత్యేక, విశేషధికార వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరువురం కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ‘ఎక్స్’  వేదికగా తెలిపారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిణామాలను పుతిన్ వివరించగా, శాంతియుత మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్ స్థిరంగా విశ్వసిస్తోందని మోదీ పునరుద్ఘాటించారు.ఈ ఏడాది చివర్లో జరగనున్న వార్షిక సదస్సు కోసం పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.

ALSO READ: https://teluguprabha.net/business/withdraw-rs-500-note/

డోభాల్ రాయబారం.. పుతిన్ భారత పర్యటన ఖరారు : ఈ ఫోన్ కాల్‌కు ఒకరోజు ముందే, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవడం గమనార్హం.  డోభాల్ తన పర్యటనలో భాగంగా, రష్యా భద్రతామండలి కార్యదర్శి సెర్గీ షొయిగుతోనూ చర్చలు జరిపారు. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని డోభాల్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివర్లో పుతిన్ భారత పర్యటనకు సంబంధించిన తేదీలు దాదాపు ఖరారయ్యాయని ఆయన ప్రకటించడం, ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో జరుగుతున్న చర్చలకు నిదర్శనం.

రైతుల ప్రయోజనాలే ముఖ్యం: ప్రధాని స్పష్టీకరణ : అమెరికా సుంకాలపై నేరుగా స్పందించనప్పటికీ, ప్రధాని మోదీ తన వైఖరిని పరోక్షంగా వెల్లడించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, దానికోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, అమెరికా సుంకాల సెగ తగిలిన బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వాతోనూ ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ పరిణామం, అమెరికా ఏకపక్ష వాణిజ్య విధానాలపై ఉమ్మడి వైఖరిని ప్రదర్శించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad