ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం థాయ్‌లాండ్ పర్యటనకు బయలుదేరి బ్యాంకాక్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధులు, భారతీయులు పెద్ద ఎత్తున వచ్చి.. స్వాగతం పలికారు.
మోడీ ఈ పర్యటనలో రెండు రోజులు థాయ్‌లాండ్‌లో గడపనున్నారు. ఇందులో భాగంగా 6వ బిమ్‌స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. అదేవిధంగా థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రాతో భేటీ అవి, ద్వైపాక్షిక సంబంధాల బలపాటు, సహకారంపై చర్చించనున్నారు.
ఈరోజు సాయంత్రం బిమ్‌స్టెక్ సదస్సులో మోడీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భారత్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, భూటాన్ దేశాల నేతలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో సాంకేతికత, ఆర్థిక సహకారం తదితర అంశాలపై విశ్లేషణ జరగనుంది.