మయన్మార్(Myanmar)లో సంభవించిన భూకంపం(Earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.7 ధాటికి పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. ఇప్పటివరకు 1700 మందికి పైగా చనిపోగా..వేల మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే అనాధికార లెక్కల ప్రకారం 10వేల మందికి పైగా మృత్యువాత పడ్డారని అంచనా వేస్తున్నారు.
మయన్మార్ భూకంపం ఏకంగా 300 కంటే ఎక్కువ అణు బాంబులకు సమానం అని ప్రముఖ అమెరిక్ జియోలజిస్ట్ జెస్ ఫీనిక్స్ తెలిపారు. ఇలాంటి భారీ భూకంపాలు విడుదల చేసే శక్తి దాదాపుగా 334 అణు బాంబులకు సమానం అని చెప్పారు. మయన్మార్‌లో వచ్చిన భూకంపం తర్వాత వస్తున్న ప్రకంపనలు నెలల తరబడి కొనసాగే అవకాశం ఉందన్నారు .మయన్మార్ కింద ఉన్న ఇండియన్ టెక్లానిక్ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ కింద చొచ్చుకుపోతుండటం వల్ల ఈ భూకంపం వచ్చినట్లు వివరించారు.