Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nepal lifts ban on social media: దిగొచ్చిన నేపాల్ సర్కార్..సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత

Nepal lifts ban on social media: దిగొచ్చిన నేపాల్ సర్కార్..సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తివేత

Social Media: నేపాల్​ ప్రభుత్వం దిగొచ్చింది.  సోషల్​ మీడియాపై విధించిన నిషేధం (బ్యాన్​) ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఆందోళనలు విరమించాలని నిరసకారులను కోరింది. ఈ మేరకు అర్థరాత్రి దాటిన తర్వాత సమాచారశాఖ మంత్రి పృద్వీ సభా గురుంగ్​ ఒక ప్రటకన చేశారు.

- Advertisement -

గత కొన్ని రోజులుగా దేశంలో వివిధ యాప్​లపై నిషేధంచడంతో జెన్​ జీ నాయకత్వంతో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. సోమవారం జనం వీధుల్లోకి వచ్చి తీవ్రస్థాయిలో ఉద్యమించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హోంమంత్రి రాజీనామా చేసేంత వరకు పరిస్థితులు వెళ్లాయి.

‘ప్రభుత్వం సోషల్​ మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నాం. దయచేసి ఆందోళనలు విరమించండి’ అని గురుంగ్​ కోరారు.

అయితే నిరసనలో పలువురు చనిపోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండువారాల్లో ఆందోళనలకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపి నివేదిక రెడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా ప్రముఖ సోషల్ మీడియా నెట్​వర్క్​ ఎక్స్​ తమ దేశ సార్వభౌమత్వాన్ని అగౌరవపరిచేలా వ్యవహరించిందని ఇంతకు ముందు జరిగిన కేబినెట్​ భేటీలో ప్రధాని కేపీ శర్మ ఒలీ మండిపడ్డారు. ఎక్స్​ నేపాల్​లో రిజిస్టర్​ చేసుకోలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఒలీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్​ చట్టాలకు అనుగుణంగా, నిబంధనలు పాటిస్తూ తమ దేశంలోకి ఎంటర్​ కావాలని సంవత్సరంన్నర కాలంగా చెబుతున్నా ఎక్స్​ యాజమాన్యం తమను అవమానించేలా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

తమ దేశ నిబంధనలకు అనుగుణంగా రిజిస్టర్​ చేసుకోవాలని గతవారం పలు సోషల్​ మీడియా ఫ్లాట్​ఫాంలకు నేపాల్ ప్రభుత్వం సూచించింది.

దీంతో కొందరు నకిలీ అకౌంట్లతో సోషల్​ మీడియాను యాక్సెస్​ చేసి తప్పుడు సమాచారం, దుష్ర్పచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కచ్చితంగా నేరమేనని స్పష్టం చేశాయి.

కాగా, ఫేస్​బుక, ఎక్స్​, యూట్యూబ్​, ఇన్​స్టాగ్రాం, చైనా యాప్​ టాన్సెంట్​, స్నాప్​షాట్, పింట్​రెస్ట్ వంటి పలు యాప్​లను ప్రభుత్వం బ్యాన్​ చేసింది. దీంతో నేపాల్​లోని పలు వర్గాలు తీవ్రస్థాయి నిరసనలు చేపట్టారు. దీంతో సోమవారం అదుపు తప్పాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో 19 మంది చనిపోయారు.  దీంతో ఆందోళన మరింత తీవ్రతరం  చేస్తామని నిరసనకారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నేపాల్​ ప్రభుత్వం సోషల్​ మీడియా యాప్​లపై విధించిన నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు విధించిన బ్యాన్​ సబబేనని ప్రభుత్వం సమర్ధించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad