Nepal Students protest: నేపాల్ యువత ప్రభుత్వంపై నిరసనలకు దిగారు. దీంతో నేపాల్ రాజధాని ఖాట్మండులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్‌లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయు ప్రయోగీంచారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనకు దిగారు. ఇటీవల నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించారు. ఈ యాప్స్ తమ దేశంలో నమోదు కాలేదన్న కారణంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఆగ్రహించిన యువత ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 80 మంది ఆందోళనకారులు గయపడగా.. ఒకరు మృతి చెందారు.
వ్యక్తిగత స్వేచ్ఛపై నిషేధం: ప్రస్తుతం ఖాట్మండుతోపాటు విరాట్‌నగర్, భరత్‌పూర్, పోఖ్రా వంటి 10 నగరాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన సోషల్ మీడియా నిషేధంపై.. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి కెపి శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం.. వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటుందని ఆరోపించారు.
సోషల్ మీడియా నిషేధం ఒక్కటే కారణం కాదంటున్న యువత: ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనపై యువత స్పందించారు. సోషల్ మీడియా నిషేధం ఒక్కటే కారణంకాదని వారు తెలిపారు. ఈ ఉద్యమాన్ని “జనరేషన్-జెడ్ విప్లవం”గా పేర్కొన్నారు. ఈ నిరసనలను రాజకీయ పార్టీల మద్దతు లేకుండా స్వతంత్రంగా చేస్తున్నట్లుగా యువత తెలిపారు. తమ స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించుకోవడానికి మరియు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలనేదే మా డిమాండ్ అని యువత అన్నారు.


