Tuesday, January 7, 2025
Homeఇంటర్నేషనల్Virus: చైనాలో పిల్లులకు కొత్తవైరస్.. ఏం దిక్కుమాలిన దేశం రా స్వామి..!

Virus: చైనాలో పిల్లులకు కొత్తవైరస్.. ఏం దిక్కుమాలిన దేశం రా స్వామి..!

2019-2020లో కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. అన్ని దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి యావత్ ప్రపంచం బయట పడి.. సాధారణ జీవితం గడుపుతోంది. ఈ కరోనా వైరస్ చైనాలోని పూహాన్ ల్యాబ్ నుంచి మొదలైందని ఎన్నో అధ్యయనాలు చెపుతున్నాయి. అయినా దీనిని డ్రాగన్ కంట్రీ అంగీకరించడం లేదు.

- Advertisement -

అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా మరోసారి మానవాళిని భయపెట్టడానికి కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఇదికూడా చైనాలోనే పుట్టింది. తాజాగా చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్‌ – హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మళ్లీ తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుంచి జపాన్, హాంకాంగ్ వంటి దేశాలకు ఇప్పటికే వ్యాప్తి చెందగా.. ఆసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇక ఇప్పటికే చైనాలో హెచ్‌ఎంపీవీ అనే మరో వైరస్‌ కలకలం రేపుతున్న వేళ.. పిల్లులకు ప్రాణాంతక వ్యాధి సోకుతుండటం అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలోనే చైనాలో పిల్లులు పెంచుకునే వారు అలర్ట్ అయ్యారు. తాము పెంచుకునే పెంపుడు పిల్లులు ఈ ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్ అనే వ్యాధి బారిన పడకూడదనే ఆలోచనతో కొంతమంది తమ పిల్లులకు మనుషులకు సోకే కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేసే చికిత్సలో వాడే మందులను వేస్తున్నట్లు చైనా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెరిటోనిటిస్ అనేది ఒక వైరల్ వ్యాధి అని.. దీన్ని ఫీలైన్ కరోనావైరస్ అని కూడా అంటారని తెలుస్తోంది. అయితే ఈ ఫీలైన్ కరోనా వైరస్ కేవలం పిల్లులకు మాత్రమే వస్తుందని చెపుతున్నారు. ఈ వైరస్‌ పిల్లి శరీరం అంతటా వ్యాపించే ముందు తెల్ల రక్త కణాలకు సోకుతుందని.. ఇక ఆ వైరస్ కట్టడికి వాడే మందులు చాలా ఖరీదైనవని తెలుస్తోంది. దీంతో ఆ మందులకు బదులు కొన్ని కొవిడ్‌ యాంటీ వైరల్‌ మాత్రలు కూడా ప్రభావం చూపుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఏదైమైనా చైనాలో పుట్టుకొస్తున్న కొత్త కొత్త వైరెస్ లతో జనం వణికిపోతున్నారు. మరి ఈ వైరెస్ లు ఎలా విజృంభిస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News