Friday, March 14, 2025
Homeఇంటర్నేషనల్Holi Celebrations: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని

Holi Celebrations: హోలీ వేడుకల్లో న్యూజిలాండ్ ప్రధాని

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు(Holi Celebrations) అంబరాన్నంటాయి. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈక్రమంలో న్యూజిలాండ్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లుక్సాన్‌ (Christopher Luxon) సైతం ప్రజలతో కలిసి హోలీ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

మార్చి 16న వాణిజ్యం, పెట్టుబడులు సహా కీలక అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు లుక్సాన్ భారత్‌కు రానున్నారు. న్యూజిలాండ్‌ ప్రధాని హోదాలో తొలిసారిగా ఈనెల 20 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాంగా ప్రధాని మోడీతో చర్చలు జరపడంతో పాటు మార్చి 17న న్యూఢిల్లీలో జరగనున్న 10వ రైసినా డైలాగ్‌ ప్రారంభ సమావేశంలోముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News