Thursday, April 3, 2025
Homeఇంటర్నేషనల్Nithyananda: నిత్యానంద స్వామి చ‌నిపోలేదు.. కైలాస దేశం ప్రకటన

Nithyananda: నిత్యానంద స్వామి చ‌నిపోలేదు.. కైలాస దేశం ప్రకటన

వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద(Nithyananda) స్వామి జీవస‌మాధి అయిన‌ట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ వెల్లడించారు. దీంతో ఆయన భక్తులు, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా నిత్యానంద చనిపోలేదని ఆయన స్వయంగా ప్రకటించుకున్న కైలాస దేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న సుర‌క్షితంగా, చురుకుగా ఉన్న‌ట్లు తెలిపింది. దురుద్దేశపూరితంగానే కొంద‌రు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని పేర్కొంది. ఈమేరకు మార్చి 30న జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార లింక్‌ను జత చేసింది.

- Advertisement -

కాగా 2019లో అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ద‌క్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌ సమీపంలో ఓ దీవిని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దానిని ప్రత్యేక హిందూ దేశంగా పేర్కొంటూ కైలాస దేశంగా నామ‌క‌ర‌ణం చేశారు. అంతేకాకుండా ప్రత్యేక కరెన్సీ, పాస్ పోర్ట్, వీసాలు కూడా తీర్చిదిద్దారు. ఇక ఆయన ఆస్తులు సుమారు రూ.4వేల కోట్లకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News