Nobel Peace Prize Winner Maria Corina Machado: వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడోకు 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె దేశంలో ప్రజాస్వామ్యం కోసం, నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ALSO READ: Nobel Peace Prize: నోబెల్ డ్రామా.. అవార్డును ట్రంప్‌కు అంకితమిచ్చిన మచాడో.. కమిటీపై వైట్ హౌస్ ఫైర్
విమర్శలకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది, గాజాపై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడులకు మచాడో మద్దతు పలకడం. గతంలో ఆమె ఇజ్రాయెల్‌కు, బెంజమిన్ నెతన్యాహు పార్టీకి అనుకూలంగా చేసిన పోస్టులను విమర్శకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “వెనిజులా పోరాటం ఇజ్రాయెల్ పోరాటమే” అని ఆమె గతంలో వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వస్తే వెనిజులా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మారుస్తానని కూడా ఆమె హామీ ఇచ్చారు.
గాజాలో “మారణహోమానికి” కారణమైన వారికి మద్దతిచ్చిన వ్యక్తికి శాంతి బహుమతి ఎలా ఇస్తారని నార్వేకి చెందిన ఒక చట్టసభ సభ్యుడు ప్రశ్నించారు. ఈ నిర్ణయం నోబెల్ బహుమతి ప్రతిష్టను దెబ్బతీస్తుందని అమెరికాకు చెందిన కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) తీవ్రంగా ఖండించింది.
రెండో కారణం, వెనిజులాలోని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూలదోయడానికి విదేశీ సైనిక జోక్యాన్ని కోరడం. 2018లో, మదురో ప్రభుత్వాన్ని గద్దె దించడంలో సహాయం చేయాలని ఆమె ఇజ్రాయెల్, అర్జెంటీనా దేశాలను కోరుతూ బహిరంగ లేఖ రాశారు.
ఒకవైపు నోబెల్ కమిటీ ఆమెను ‘ప్రజాస్వామ్య జ్యోతి’ అని, ‘శాంతి దేవత’ అని కీర్తిస్తుంటే, మరోవైపు ఆమె గతం ఇప్పుడు పెను వివాదంగా మారింది. మచాడో ఈ బహుమతిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అంకితం ఇవ్వడం గమనార్హం.
ALSO READ: GLOBAL TRADE WAR: చైనాపై ట్రంప్ ‘సుంకాల’ బాంబు.. 100% టారిఫ్‌లతో కొత్త వాణిజ్య యుద్ధానికి తెర!


