Saturday, November 15, 2025
HomeTop StoriesNobel Prize 2025: క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధన.. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

Nobel Prize 2025: క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధన.. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

Nobel Prize 2025 in Physics: ఈ ఏడాది భౌతిక‌శాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లను నోబెల్ పురస్కారం వరించింది. ఎల‌క్ట్రిక్ సర్క్యూట్‌లో సంభ‌వించే ఎన‌ర్జీ క్వాంటిజేష‌న్‌పై చేప‌ట్టిన విశేష పరిశోధనకు జాన్ క్లార్క్‌, మైఖేల్ హెచ్ దేవ‌రేట్‌, జాన్ ఎం మార్టినిస్‌ల‌కు సంయుక్తంగా అవార్డును నోబెల్‌ జ్యూరీ ప్రకటించింది. ఈ నెల 13 వరకు విజేతల ప్రకటన పూర్తి కానుంది. అనంతరం డిసెంబర్ 10 న నోబెల్ పురస్కారాలను బహుకరించనున్నారు. 

- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన ప్రక్రియ  కొనసాగుతోంది. సోమవారం వైద్య శాస్త్ర విభాగంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ భౌతిక శాస్త్రంలో విశేష కృషి ముగ్గురు సైంటిస్టులకు జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లు నోబెల్‌ ప్రైజ్‌ను ప్రకటించారు. 

Also Read: https://teluguprabha.net/international-news/nobel-prize-2025-winners-in-medicine-filed/

ఓ చిప్‌పై నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల ద్వారా క్వాంట‌మ్ ఫిజిక్స్ గురించి ఈ శాస్త్ర‌వేత్త‌లు వివరించారు. క్వాంట‌మ్ మెకానిక‌ల్ ట‌న్నెలింగ్ గురించి కూడా ఎల‌క్ట్రిక్ స‌ర్క్యూట్ ద్వారా సైంటిస్టులు ప‌రీక్షించినట్లు ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. క్వాంట‌మ్ మెకానిక‌ల్ ల‌క్ష‌ణాల గురించి మాక్రోస్కోపిక్ స్థాయిలో ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చని ఈ సైంటిస్టులు నిరూపించారు. కంప్యూట‌ర్ మైక్రోచిప్స్‌లో ఉండే ట్రాన్సిస్ట‌ర్స్ ఆధారంగా క్వాంట‌మ్ టెక్నాల‌జీ ఎంత ప్ర‌భావిత‌మైందో దీని ద్వారా అర్థం చేసుకోవ‌చ్చు. 

Also Read: https://teluguprabha.net/international-news/frances-prime-minister-sebastien-lecornu-resigns-hours-after-unveiling-new-cabinet-amid-political-deadlock/

క్వాంట‌మ్ క్రిప్టోగ్ర‌ఫీ, క్వాంట‌మ్ కంప్యూట‌ర్స్‌, క్వాంట‌మ్ సెన్సార్స్ అంశాల్లో శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ మేరకు నోబెల్‌ జ్యూరీ క‌మిటీ తెలిపింది. విజేతలకు నోబెల్ బహుమతితో పాటు.. 10 లక్షల డాలర్లు(రూ.8.8 కోట్ల) నగదు అందించనున్నారు. 1896లో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి నోబెల్ ట్రస్ట్ ద్వారా ఈ నోబెల్ అవార్డులను ప్రతీ సంవత్సరం బహుకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad