Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nobel Prize: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

Nobel Prize: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి

Nobel Prize For Economics 2025: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురిని వరించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఈ అత్యున్న పురస్కారాన్ని ప్రకటించింది. వీరి ముగ్గురి పరిశోధన, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/malala-yousafzai-marijuana-oxford-taliban-attack-flashbacks-2025/

సాంకేతిక పురోగతి ద్వారా సుదీర్ఘకాలం పాటు కొనసాగే వృద్ధికి అవసరమైన ముందస్తు పరిస్థితులను చారిత్రక ఆర్థికవేత్త జోయెల్ మోకిర్కు గుర్తించారు. సమాజం కొత్త ఆలోచనలను అంగీకరించి, మార్పును అనుమతించినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని వివరించడంతో సగం బహుమతి జోయెల్ మోకిర్కుకి దక్కనుంది. ఫిలిప్ అగియోన్, పీటర్ హౌవిట్లకు మిగిలిన సగం బహుమతిని అందుకోనున్నారు.

Also Read: https://teluguprabha.net/top-stories/bhopal-toxic-waste-disposal-court-order-2025-judges-order-high-safety-measures-with-experts-team-directions/

సిద్ధాంతం ద్వారా సుస్థిర వృద్ధిని వివరించే గణిత నమూనా- సృజనాత్మక విధ్వంసం నమూనాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని క‌మిటీ పేర్కొంది. ఈ రోజు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటనతో ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. కాగా, ఈ బహుమతి విలువ 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్‌లు ($1.2 మిలియన్లు)గా ఉంటుంది. ఇక ఆరు రంగాలైన వైద్య, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతితో పాటు ఆర్థిక శాస్త్రం రంగాల్లో విశిష్టమైన సేవలందించినందుకు గాను నోబెల్‌ ఫౌండేషన్‌ నోబెల్‌ బహుమతులు ప్రకటించింది. ఇక ఆర్థిక శాస్త్రంలో పొందే నోబెల్‌ బహుమతిని అత్యంత అరుదైన గౌరవంగా చెప్పుకొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad