Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Nobel Prize: వైద్య శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ పురస్కారం

Nobel Prize: వైద్య శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ పురస్కారం

Nobel Prize 2025 Medicine: వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గాను ప్రముఖ శాస్త్రవేత్తలు.. మేరీ ఇ. బ్రున్‌కో, ఫ్రెడ్‌ రామ్స్‌డెల్‌, షిమన్‌ సకాగుచీకి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది. అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాలను నోబెల్ జ్యూరీ ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా వైద్య విభాగానికి సంబంధించి నోబెల్ పురస్కారాలను సోమవారం జ్యూరీ ప్రకటించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/opt-cancellation-us-economy-impact-foreign-students-bill/

నోబెల్‌ పురస్కారాల పండుగ మొదలైంది. వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం ఈ నెల 13 వరకు కొనసాగనున్నట్లు జ్యూరీ ప్రకరటించింది. పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్‌ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కాగా, రోగ నిరోధక వ్యవస్థను ఎలా అదుపులో ఉంచుతారనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను అమెరికాకు చెందిన మేరీ ఇ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచిలు వైద్య రంగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారని నోబెల్ జ్యూరీ వెల్లడించింది.

 

ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కొత్త పరిశోధనా రంగానికి పునాది వేశాయని.. క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధుల వంటి కొత్త చికిత్సల అభివృద్ధికి దోహదపడ్డాయని నోబెల్‌ జ్యూరీ పేర్కొంది. పరిధీయ రోగనిరోధక సహనానికి(peripheral immune tolerance) సంబంధించి వీరి పరిశోధనలు కొనసాగాయి. 

Also Read: https://teluguprabha.net/international-news/6-dead-in-gaza-strikes-hours-after-trump-called-on-israel-to-stop-bombing/

కాగా, నోబెల్ పురస్కారాలను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్య శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన సామాజికవేత్తలకు ప్రతియేటా ప్రదానం చేస్తుంటారు. ఈ ఐదు పురస్కారాలను వ్యాపారవేత్త, ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ప్రారంభించారు. విజేతలను వివిధ సంస్థల నుంచి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు నిర్ణయిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad