ఆమధ్య నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కనిపించటం లేదు..మిస్ అయ్యారంటూ వచ్చిన వార్తలను తిప్పికొడుతూ కిమ్ జాంగ్ ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు తాను చేతల మనిషినేనని ఏకంగా కూతురుతో కలిసి మిస్సైల్స్, ఆయుధాలతో కూడిన పెరేడ్ లో సందడి చేస్తూ కనిపించే ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యేలా చేశారు. దీంతో అసలు కిమ్ జాంగ్ స్ట్రాటెజీ ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. అమెరికాకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ను క్షణాల్లో మోసుకెళ్లే మిస్సైల్స్ ను ఇలా ప్రదర్శించటం ద్వారా తన ఆయుధ సంపత్తిని చూపుతూ కిమ్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టైంది.
వంశ పారంపర రాజకీయాలు ఉత్తర కొరియాలో కొనసాగుతాయన్న సందేశాన్ని ఇచ్చేందుకన్నట్టు 10 ఏళ్ల కుమార్త జు ఏని ఆయన వెంట పెట్టుకుని ఇలా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తర కొరియన్ల తరువాత తరానికి రక్షణ కల్పించేది ఈ న్యూక్లియర్ ఆయుధాలేనంటూ కిమ్ చెబుతున్నారు.