Intel CEO vs Trump : ఇంటెల్ కార్పొరేషన్ సీఈవో లిప్-బు టాన్, తనకు కంపెనీ బోర్డు సభ్యుల పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ, అమెరికా అధ్యక్షుడి కార్యాలయాన్ని సంప్రదించి వాస్తవాలను వెల్లడించినట్లు తెలిపారు. అమెరికా ఆర్థిక, జాతీయ భద్రత లక్ష్యాలను తాను పంచుకుంటానని, న్యాయ, నైతిక విలువలను ఎల్లప్పుడూ పాటిస్తానని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కంపెనీ అంతర్గత వెబ్‌సైట్‌లో ప్రచురించారు.
ALSO READ : India-Pakistan Ceasefire : ట్రంప్ ‘అక్కసు’ వెనుక అసలు కథ అదేనా..?
లిప్-బు టాన్ గతంలో వాల్డన్ ఇంటర్నేషనల్, కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్‌లో పనిచేసిన సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తి జరిగిందని ఆరోపించారు. ఇంటెల్‌ను నడిపించడం కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ఇది ఒక గౌరవమని, తన ప్రతిష్ఠ విశ్వాసంతో సంపాదించినదని స్పష్టం చేశారు.
ALSO READ : US tariffs on India impact : భారత్ ఎగుమతులపై అమెరికా పిడుగు.. 50% సుంకాలతో కుదేలు!
అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్‌లో టాన్ రాజీనామా చేయాలని పోస్ట్ చేయడంతో వివాదం రాజుకొంది. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఒక కంపెనీ సీఈవో ను రాజీనామా చేయాలని కోరటం ఇదే మెుదటిసారి. ఇక ఇంటెల్ కంపెనీ మార్కెట్ పోటీలో మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో ఈ వివాదం కంపెనీకి సవాల్‌గా మారింది. రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్, టాన్‌కు చైనా కంపెనీలతో సంబంధాలు, కాడెన్స్ డిజైన్‌పై క్రిమినల్ కేసు ఆరోపణలను ప్రస్తావిస్తూ ఇంటెల్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. ఇక రాయిటర్స్ కథనం ప్రకారం, టాన్ తన వెంచర్ ఫండ్స్ ద్వారా చైనా సైనిక సంస్థలతో సహా వందలాది కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.


