Monday, March 17, 2025
Homeఇంటర్నేషనల్Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. 11 మంది మృతి, 22 మంది గాయాలు..!

Bomb Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. 11 మంది మృతి, 22 మంది గాయాలు..!

జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన హైజాక్ తర్వాత పాకిస్తాన్‌లో మళ్ళీ హింస చెలరేగింది. ఆదివారం నైరుతి పాకిస్తాన్‌లోని అల్లకల్లోల ప్రాంతంలో భద్రతా దళాలను తీసుకెళ్తున్న బస్సు దగ్గర బాంబు పేలింది. ఈ పేలుడులో కనీసం 11 మంది మరణించగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్తాన్‌లోని నౌష్కి జిల్లాలో ఈ దాడి జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. మృతులను, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అయితే స్థానిక వర్గాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. గత 12 గంటల్లో బలూచిస్తాన్‌లో 19 దాడులు జరిగాయని సమాచారం. శనివారం, క్వెట్టాలో మరో బాంబు దాడి జరిగింది. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) పేలుడులో ఉగ్రవాద నిరోధక దళం (ATF)కు చెందిన ఓ అధికారి మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. క్వెట్టాలోని బరోరి రోడ్డులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ATF పెట్రోలింగ్ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన ఏడుగురు అధికారులను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్న ఒకరు మరణించారు.

బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుండి విడదీయాలని కోరుకునే వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), మంగళవారం పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వీరిలో చాలామంది భద్రతా సిబ్బంది ఉన్నారు. బుధవారం BLA తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. బందీలను విడిచిపెట్టాలంటే, బలూచ్ రాజకీయ ఖైదీలు మరియు కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్ సైన్యం గురువారం ఆపరేషన్ ప్రారంభించి 33 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు ప్రకటించింది. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ శుక్రవారం నాడు 214 మంది సైనిక బందీలను హతమార్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ తన సాంప్రదాయ మొండితనం సైనిక దురహంకారాన్ని ప్రదర్శిస్తోంది. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇస్లామాబాద్ ప్రభుత్వం పరిస్థితిని గమనించలేదు. దీని ఫలితంగా 214 మంది బందీలను హతమార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News