పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భయ పడుతోంది. బయట ప్రపంచానికి ధైర్యంగా కనిపిస్తూ బీరాలు పలుకుతున్న పాక్ అధికారుల లోపల తీవ్ర గందరగోళంలో ఉంది. ఆర్థికంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు యుద్ధం లాంటి పరిస్థితి మరింత కష్టాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని అక్కడి నేతలు భయపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం మూడు రోజులకు సరిపడే చమురు నిల్వలు మాత్రమే ఉండగా, యుద్ధం తీవ్రత పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమనే భావన నెలకొంది.
ఇటీవల కాలంలో బెలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) తిరుగుబాటు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో తాలిబాన్ దాడులు ఉధృతం అవుతుండటంతో పాకిస్తాన్ ఆర్మీ మూడో మోచేయి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో యుద్ధానికి సిద్ధమయ్యే ముందు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు తమ కుటుంబాల భద్రతపై దృష్టి పెట్టారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన కుటుంబాన్ని యూకేకు తరలించినట్టు సమాచారం. ఇతర సీనియర్ అధికారులు కూడా ప్రైవేట్ విమానాల ద్వారా తమ కుటుంబాలను విదేశాలకు పంపించారు.
యుద్ధానికి రెడీగా ఉన్నామని పాక్ చెబుతున్నా.. వెనకటి పంథాలో భారత్ చర్యలు ఆపేయాలని ఇతర దేశాల మద్దతు కోరుతున్నారు. అంతేకాదు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా పహల్గామ్ దాడిపై అంతర్జాతీయ విచారణకు సిద్ధమని ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి పలు సందర్భాల్లో తమ mistakes ను అంగీకరించాల్సి రావడం విశేషం.
మరోవైపు, భారత్ ఇప్పటికే బలప్రదర్శన మొదలుపెట్టింది. అరేబియా సముద్రంలో INS సూరత్ యుద్ధనౌక నుంచి క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించింది. భారత వాయుసేన రాఫెల్, సుఖోయ్ యుద్ధవిమానాలతో వార్ డ్రిల్‌లు చేస్తూ శత్రువుకు హెచ్చరికలు పంపుతోంది. భారత నావికాదళం తన శక్తిని మరింతగా పెంచుతూ, విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను సముద్రంలో మోహరించింది. విక్రాంత్ నౌకపై MiG-29K యుద్ధవిమానాలు, అటాక్ హెలికాప్టర్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మిలిటరీ ఎప్పుడు, ఎలా భారత్ దాడికి దిగుతుందో అర్థం కాక హడలిపోతుంది. పైపై ధైర్యంగా కనిపించినా, లోపల నుంచి పాకిస్తాన్ తీవ్ర భయబ్రాంతిలో ఉంది.