Wednesday, February 11, 2026
Homeఇంటర్నేషనల్Pakistan: ఆర్థిక సంక్షోభంలో పాక్ కీలక నిర్ణయం.. 50 ఏళ్ల తర్వాత మద్యం ఎగుమతులకు గ్రీన్...

Pakistan: ఆర్థిక సంక్షోభంలో పాక్ కీలక నిర్ణయం.. 50 ఏళ్ల తర్వాత మద్యం ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్!

Pakistan Economic Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా, దేశంలోని అతి పురాతన మద్యం తయారీ సంస్థ ‘ముర్రీ బ్రూవరీ’ (Murree Brewery) కి అంతర్జాతీయ మార్కెట్లోకి మద్యం ఎగుమతి చేసేందుకు అనుమతినిస్తూ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

165 ఏళ్ల చరిత్ర.. 50 ఏళ్ల నిరీక్షణ : బ్రిటిష్ పాలనలో 1860లో స్థాపించిన ముర్రీ బ్రూవరీకి ఇది 165 ఏళ్ల నాటి భారీ మైలురాయి. 1970వ దశకంలో పాకిస్తాన్‌లో ముస్లింలకు మద్యంపై నిషేధం విధించిన నాటి నుండి ఎగుమతులపై కూడా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. ఈ లైసెన్స్ కోసం ఆ సంస్థ యాజమాన్యం మూడు తరాలుగా సుదీర్ఘ పోరాటం చేసింది. ఎట్టకేలకు 50 ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుండి లైసెన్స్ లభించడంతో.. ఇప్పటికే జపాన్, బ్రిటన్, పోర్చుగల్ వంటి దేశాలకు ప్రయోగాత్మకంగా షిప్‌మెంట్లు పంపారు.

Bangladesh: బ్రేకింగ్‌ న్యూస్‌.. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తుందా? : ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ముర్రీ బ్రూవరీ వార్షిక ఆదాయం సుమారు 100 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.900 కోట్లు). ఇందులో సగానికి పైగా కేవలం మద్యం అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల ఈ ఆదాయం భారీగా పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ముస్లింలపై నిషేధం: పాకిస్తాన్‌లోని ముస్లింలు మద్యం సేవించడంపై పూర్తి నిషేధం ఉంది.

మినహాయింపు: కేవలం 90 లక్షల మంది ఉన్న ముస్లిమేతర మైనారిటీలు, విదేశీయులకు మాత్రమే లైసెన్స్ ఉన్న షాపుల ద్వారా మద్యం కొనుగోలు చేసే అనుమతి ఉంది.

ప్రకటనలపై నిషేధం: దేశంలో మద్యం గురించి ప్రకటనలు చేయడంపై కూడా నిషేధం కొనసాగుతోంది.

గ్లోబల్ మార్కెట్ పై గురి : ముర్రీ బ్రూవరీ ప్రస్తుతం యూరప్, ఆసియా, ఆఫ్రికా మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. తమ బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడానికి అంతర్జాతీయ వేదికలే సరైనవని కంపెనీ సీఈఓ ఇస్పన్యార్ భండారా తెలిపారు. రాబోయే 3-4 ఏళ్లలో ఎగుమతులను భారీగా విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

MGNREGA : ఉపాధి హామీపై కేంద్రం కొరడా.. ‘నకిలీ’ డిమాండ్లకు చెక్! రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరిక!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News