Friday, April 25, 2025
Homeఇంటర్నేషనల్Pakistan: అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం: పాకిస్తాన్

Pakistan: అమెరికా కోసమే ఉగ్రవాదాన్ని పోషించాం: పాకిస్తాన్

పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే భారత ఆరోపణలు నిజమయ్యాయి. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా పాకిస్తాన్(Pakistan) రక్షణమంత్రే అంగీకరించారు. పహల్గాం దాడి (Pahalgam Terror Attack) తదనంతరం నెలకొన్న పరిస్థితులపై ఓ అంతర్జాతీయ మీడియా ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, శిక్షణ, మద్దతు వంటివి పాక్‌ చాలాకాలంగా చేస్తోందనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అవునని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పాక్ నీచ బుద్ధి మరోసారి బయటపడింది.

- Advertisement -

అయితే అమెరికా కోసమే తాము ఉగ్రవాదులను పెంచి పోషించామంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమ దేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని తెలిపారు. అయితే దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News