Friday, July 5, 2024
Homeఇంటర్నేషనల్Pakistan: అక్రమంగా పఠాన్, జైలు శిక్ష తప్పదన్న సెన్సార్ బోర్డ్

Pakistan: అక్రమంగా పఠాన్, జైలు శిక్ష తప్పదన్న సెన్సార్ బోర్డ్

పఠాన్ సినిమా 10 రోజుల్లో 700 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. ఇక మన పొరుగు దేశమైన పాకిస్థాన్ లో మిగతా భారతీయ సినిమాల్లానే పఠాన్ ను కూడా నిషేధించారు. కానీ పాక్ లో షారూఖ్ కు భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమాను అక్కడ అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు టికెట్లు కూడా బాగా సేల్ అవుతూ బాక్సాఫీస్ కలెక్షన్స్ నిండిపోతున్నాయి. మరోవైపు అనుమతుల్లేకుండా ఇలా పఠాన్ సినిమా దేశంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రదర్శిస్తే లక్ష రూపాయల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని సింధ్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్స్ సెన్సార్ కఠిన ఆదేశాలు జారీ చేసినా వీటిని లెక్కచేయకుండా పాకిస్థానీయులు పఠాన్ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News