Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Balochistan: బలూచిస్థాన్‌లో ప్రజల 'అదృశ్యం'.. తమ అధికారులపై పాక్ నేత సంచలన ఆరోపణ

Balochistan: బలూచిస్థాన్‌లో ప్రజల ‘అదృశ్యం’.. తమ అధికారులపై పాక్ నేత సంచలన ఆరోపణ

Authorities ‘Disappearing’ People In Balochistan: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లో ప్రజలు అదృశ్యం కావడం, కిడ్నాప్‌లకు గురవడం వెనుక స్వయంగా ఆ దేశ అధికారుల హస్తమే ఉందని పాకిస్తాన్ రాజకీయ నాయకుడు మౌలానా ఫజల్-ఉర్-రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు అంతర్గత రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

- Advertisement -

బలూచిస్థాన్‌లో చాలా కాలంగా ‘అదృశ్యాలు’ (Enforced Disappearance) ఒక ప్రధాన సమస్యగా ఉంది. సంవత్సరాలుగా వేలాది మంది బలూచ్ యువకులు, కార్యకర్తలు ‘డీప్ స్టేట్’ (Deep State) ద్వారా బలవంతంగా అదృశ్యం చేయబడుతున్నారు. తమ ప్రియమైన వారిని తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలు నిరంతరంగా నిరసనలు, సమ్మెలు నిర్వహిస్తూనే ఉన్నాయి.

ALSO READ: Cyber attack: యూరప్‌లోని ప్రధాన విమానాశ్రయాలపై సైబర్ దాడి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం..!

సొంత నాయకుడి బహిరంగ ప్రకటన:

ఖైబర్ పఖ్తున్ఖ్వాలో జరిగిన ఒక సభలో జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-పి (JUI-P) నాయకుడు మౌలానా ఫజల్-ఉర్-రెహమాన్ బహిరంగంగానే ఈ విషయం ప్రకటించడం విశేషం. పాక్ అధికారులే ప్రజలను అక్రమంగా కిడ్నాప్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ALSO READ: Nepo Baby: ఫిలిప్పీన్స్‌లో జల ప్రళయం.. ‘నెపో బేబీల’పై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. నేపాల్ సీన్ రిపీట్?

అంతర్జాతీయ దృష్టి:

ఈ అంశం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశాల సందర్భంగా జెనీవా ప్రెస్ క్లబ్‌లో జరిగిన 7వ బలూచిస్థాన్ అంతర్జాతీయ సదస్సులో అమెరికన్ మానవ హక్కుల న్యాయవాది రీడ్ బ్రాడీ మాట్లాడుతూ బలూచిస్థాన్ ప్రజలకు తన పూర్తి మద్దతు తెలిపారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అకృత్యాలపై అంతర్జాతీయ పర్యవేక్షణ, స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

“బలవంతపు అదృశ్యాలు, చట్టవిరుద్ధ హత్యలు, మహిళా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి వాటిపై స్వతంత్ర విచారణకు ప్రపంచం ఒత్తిడి తేవాలి” అని బ్రాడీ నొక్కి చెప్పారు. భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు మానవ హక్కులను కప్పిపుచ్చకూడదని, బాధితుల గొంతుకలకు మద్దతు ఇవ్వాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.

ALSO READ: Donald Trump: ట్రంప్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. 60 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad