Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Pakistan ISI: పాక్ మహాకుట్ర బట్టబయలు.. బలూచిస్థాన్‌లో లష్కరే, ఐసిస్‌ల ప్రాణాంతక కూటమి!

Pakistan ISI: పాక్ మహాకుట్ర బట్టబయలు.. బలూచిస్థాన్‌లో లష్కరే, ఐసిస్‌ల ప్రాణాంతక కూటమి!

Pakistan’s ISI Brokers Alliance Between LeT and ISIS: పాకిస్థాన్ ఉగ్రవాద ఫ్యాక్టరీ మరో కొత్త, అత్యంత ప్రమాదకరమైన కుట్రకు తెరలేపింది. తమ దేశంలోని బలూచిస్థాన్‌లో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న జాతీయవాదులను అణిచివేసేందుకు, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) ఏకంగా రెండు భిన్న భావజాలాలు కలిగిన ఉగ్రవాద సంస్థలను ఏకతాటిపైకి తెచ్చింది. లష్కరే తోయిబా (LeT), ఐసిస్-ఖొరాసన్ (ISKP) ఉగ్రవాద సంస్థల మధ్య ఓ ప్రాణాంతక కూటమిని ఏర్పాటు చేసినట్లు భారత నిఘా వర్గాలు సంపాదించిన రహస్య పత్రాలు బట్టబయలు చేశాయి. ఈ పరిణామం యావత్ దక్షిణాసియా భద్రతకే పెనుముప్పుగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఈ కుట్రకు తిరుగులేని సాక్ష్యంగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో ఐసిస్-ఖొరాసన్ బలూచిస్థాన్ కోఆర్డినేటర్ మీర్ షఫిక్ మెంగల్, లష్కరే తోయిబా చీఫ్ రాణా మహమ్మద్ అష్ఫాక్‌కు ఒక పిస్టల్‌ను అందజేస్తున్నట్లు స్పష్టంగా ఉంది. ఐఎస్ఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ రెండు సంస్థల మధ్య కార్యాచరణ ఒప్పందం కుదిరిందనడానికి ఈ ఫోటోనే నిలువుటద్దమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన మీర్ షఫిక్ మెంగల్, ఎప్పటినుంచో ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తూ బలూచ్ జాతీయవాదులను లక్ష్యంగా చేసుకుని డెత్ స్క్వాడ్‌లను నడుపుతున్నాడు.

ALSO READ: Donald Trump: భారత్-పాక్ శాంతి నా వల్లే… టారిఫ్‌లతోనే దారికి వచ్చారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

తాలిబన్లు సైతం ఇస్లాం విరుద్ధమని భావించే ఐసిస్-ఖొరాసన్‌ను, పాకిస్థాన్ ఇప్పుడు బలూచ్ ఉద్యమకారులతో పాటు అఫ్ఘానిస్థాన్‌లోని పాక్ వ్యతిరేక తాలిబన్ శక్తులపైకి ఉసిగొల్పేందుకు పునరుపయోగిస్తోంది. ఇటీవల ఐసిస్-ఖొరాసన్ ప్రచార పత్రిక ‘యల్గార్‌’లో కశ్మీర్‌లోకి కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని ప్రకటించడం పెను ప్రమాదానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత మార్చిలో బలూచ్ యోధులు ఐసిస్-ఖొరాసన్ స్థావరంపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను హతమార్చడంతో, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఐఎస్ఐ రంగంలోకి దిగింది. జూన్ 2025 నాటికి లష్కరే తోయిబా చీఫ్‌తో బలూచిస్థాన్‌లో సమావేశం ఏర్పాటు చేసి, ‘పాక్ వ్యతిరేక’ శక్తులపై జిహాద్‌కు పిలుపునిచ్చింది. ఈ కొత్త కూటమితో పాకిస్థాన్.. బలూచిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో అస్థిరతను సృష్టించడమే కాకుండా, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని మళ్లీ ప్రజ్వలింపజేసే ప్రమాదకరమైన ఎత్తుగడ వేస్తోంది. ఈ సాక్ష్యాలన్నీ బయటపడుతున్నా, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదానికి, పాలనకు మధ్య తేడా లేకుండా ప్రవర్తిస్తూ తన బుద్ధిని మార్చుకోవడం లేదు.

ALSO READ: Defence co operation: భారత్ – రష్యా.. రక్షణ సహకారంలో మరో కీలక పరిణామం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad