Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Lashkar-e-Taiba: పాక్ బండారం మరోసారి బట్టబయలు.. 'ఆపరేషన్ సింధూర్' దెబ్బను ఒప్పుకున్న లష్కరే ఉగ్రవాది!

Lashkar-e-Taiba: పాక్ బండారం మరోసారి బట్టబయలు.. ‘ఆపరేషన్ సింధూర్’ దెబ్బను ఒప్పుకున్న లష్కరే ఉగ్రవాది!

Lashkar Terrorist Admits India Destroyed Muridke Camp: ఉగ్రవాదంపై తమ పోరాటం గురించి గొప్పలు చెప్పుకునే పాకిస్థాన్, మరోసారి అడ్డంగా దొరికిపోయింది. తమ దేశంలో ఉగ్ర స్థావరాలు లేవని, ఉన్నవాటిని మూసివేశామని ప్రపంచాన్ని నమ్మిస్తున్న పాక్ వాదనలను ఆ దేశ ఉగ్రవాదులే బట్టబయలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జైషే మహ్మద్ కమాండర్ తమ బహావల్‌పూర్ స్థావరంపై జరిగిన దాడిని అంగీకరించగా, ఇప్పుడు లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది ఒకరు అదే బాటలో పయనించాడు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత సైన్యం తమ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని స్వయంగా అంగీకరించాడు.

- Advertisement -

ALSO READ: Indians humiliated at Georgia : జార్జియాలో భారతీయులకు ఘోర అవమానం.. 56 మంది టూరిస్టులను!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, లష్కరే కమాండర్ ఖాసిం మాట్లాడుతూ.. “భారత దాడిలో ధ్వంసమైన మురిడ్కేలోని మర్కజ్ తైబా శిథిలాలపై నేను నిలబడి ఉన్నాను. దీని పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోంది. దేవుడి దయతో, ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తాం,” అని నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం ముందు నిలబడి చెప్పాడు. ఈ దాడికి ముందు మర్కజ్ తైబాలో ఎంతో మంది ముజాహిదీన్లు, విద్యార్థులు (తలబా) శిక్షణ పొంది “విజయం” (ఫైజ్) సాధించారని కూడా అతను ఒప్పుకున్నాడు.

ఈ వీడియో పాకిస్థాన్ వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. ఎందుకంటే, ధ్వంసమైన ఈ భవనాన్ని లష్కరే సంస్థ ఇకపై ఉపయోగించడం లేదని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ, ఉగ్రవాది ఖాసిం మాటలు పాక్ అబద్ధాలను ప్రపంచం ముందు ఉంచాయి. మరో వీడియోలో, లష్కరే ఉప-చీఫ్ సైఫుల్లా కసూరి మాట్లాడుతూ, మురిడ్కే స్థావరాన్ని పునర్నిర్మించడానికి పాక్ ప్రభుత్వం, సైన్యం నిధులు సమకూర్చాయని చెప్పడం గమనార్హం.

ALSO READ: Trump controversy: ట్రంప్ సంచలన ప్రకటన: యాంటీఫా సంస్థ ఉగ్రవాద సంస్థగా గుర్తించబడుతుందా?

మే 7న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనకు ప్రతీకారంగా, భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపి ధ్వంసం చేసింది. ఇందులో లష్కరేకు చెందిన మురిడ్కే, ముజఫరాబాద్, బర్నాలా స్థావరాలతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన బహావల్‌పూర్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన సియాల్‌కోట్ స్థావరాలు ఉన్నాయి.

భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 5 (కశ్మీర్ సాలిడారిటీ డే) నాటికి ఈ స్థావరాన్ని పునఃప్రారంభించాలని లష్కరే లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా జైష్, లష్కరే ఉగ్రవాదులు తమ ఓటమిని అంగీకరిస్తున్న వీడియోలతో, ఉగ్రవాదానికి స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్ అంతర్జాతీయంగా మరోసారి దోషిగా నిలబడింది.

ALSO READ: Nepo Baby: ఫిలిప్పీన్స్‌లో జల ప్రళయం.. ‘నెపో బేబీల’పై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. నేపాల్ సీన్ రిపీట్?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad