Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Pakistan Shamed At UN: అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ కు భంగపాటు..!

Pakistan Shamed At UN: అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ కు భంగపాటు..!

Pakistan Shamed At UN: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ ప్రపంచ వేదికపై మరోసారి అభాసుపాలైంది. పాకిస్థాన్ ఉగ్రదేశంగా మరోసారి భంగపాటు పడింది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో దాయాది దేశం అవమానపాలైంది. కాగా.. హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఖతార్‌లో ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. అయితే, దాడులపై ఐక్యరాజ్య సమితి (UN)లో చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మానవ హక్కుల న్యాయవాది, యూఎన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ (Hillel Neuer) మాట్లాడారు. ఖతార్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు. 2012 నుంచి ఖతార్‌ హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడిందనే విషయాన్ని ఖండించినందుకు యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ను హిల్లెల్ తప్పుబట్టారు.

- Advertisement -

Read Also: Chia Seeds: జుట్టు పెరగాలంటే చియా సీడ్స్ ఎలా తినాలో తెలుసా..!

హిల్లెల్ ఏమన్నారంటే?

2011లో పాకిస్థాన్‌ (Pakistan)లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ (Osama bin Laden)ను అమెరికా చంపినప్పుడు.. అప్పటి యూఎన్‌ చీఫ్ తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారని హిల్లెల్ గుర్తు చేశారు. దీంతో యూఎన్‌లో ఉన్న పాకిస్థాన్‌ ప్రతినిధి హిల్లెల్ ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకొని అభ్యంతరం తెలిపారు. బిన్‌ లాడెన్ గురించి సభలో ప్రస్తావించడంపై మండిపడ్డారు. తమ దేశంపై చేసే నిరాధారమైన ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం హిల్లెల్‌ మైక్‌ను పునరుద్ధరించిన యూఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ నాలుగు సెకన్లలో ప్రసంగాన్ని ముగించాల్సిందిగా ఆయనకు సూచించారు. దీంతో ఆగ్రహించిన హిల్లెల్‌ పాకిస్థాన్‌ (Pakistan) కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమేనని.. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులను పోషిస్తోందని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు. దీంతో తెల్లమొహం వేయడం పాక్‌ వంతైంది.

Read Also: Ashes: అతడు సెంచరీ చేయకుంటే నగ్నంగా తిరుగుతా: ఆసీస్ మాజీ క్రికెటర్

2020లోనూ..

కాగా.. 2020లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జెనీవాలోని మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ UN వాచ్ కూడా పాకిస్థాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. “భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో దైవదూషణ సహించరానిది” అని పాక్ ప్రభుత్వం సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేసింది. అప్పట్లో ప్యారిస్ లో ఒక ఫ్రెంచ్ ఉపాధ్యాయుడిని ఇస్లామిక్ ఉగ్రవాది తల నరికి చంపాడు. దానికి మద్దతిస్తున్నట్లుగా పాక్ పరోక్షంగా ట్వీట్ చేసింది. అయితే, దీనిపై యూఎన్ వాచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో పాకిస్థాన్ చేరికను ఉటంకిస్తూ నిప్పులు చెరికింది. “ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మీ ఉనికిని సహించాలి” అని UN వాచ్ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం సోషల్ మీడియా ఎక్స్ లో చేసిన పోస్ట్‌ పైనే ఈ విధంగా స్పందించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad