Monday, January 6, 2025
Homeఇంటర్నేషనల్Plane Crash: కాలిఫోర్నియాలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి

Plane Crash: కాలిఫోర్నియాలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌ నెలలో జరిగిన విమాన ప్రమాదాలు మరవక ముందే తాజాగా కొత్త సంవత్సరంలో అమెరికా(America)లోని కాలిఫోర్నియాలో ఓ విమానం(Plane Crash) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఫర్నిచర్ భవనంపై విమానం పడింది.

- Advertisement -

గత కొద్దిరోజులుగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ప్రమాదానికి గురైన విషయం విధితమే. ఈ ప్రమాదంలో 179 మంది చనిపోయారు. ఈ విమానం థాయ్‌లాండ్‌ నుంచి దక్షిణ కొరియాకు వెళ్తోంది. ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే కొంతదూరం ప్రయాణించిన తర్వాత రన్ వేపై జారిపడి డివైడర్ ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News