Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్PM Modi 75th birthday: మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. పోప్ లియో ప్రత్యేక ఆశీస్సులు

PM Modi 75th birthday: మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. పోప్ లియో ప్రత్యేక ఆశీస్సులు

PM Modi 75th birthday: సెప్టెంబర్ 17తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 ఏళ్లు నిండాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశ, విదేశాల నేతలు, పలురంగాల ప్రముఖులు బుధవారం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశాన్ని పాలిస్తున్న తీరును, దార్శనికతను, నాయకత్వ పటిమను కొనియాడారు. వేర్వేరు రాష్ట్రాల్లో, విదేశాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి బ్రిటిష్ ప్రధాన మంత్రి జార్జియా మలోనీ వరకు, వాటికన్ నగర అధిపతి పోప్ లియో XIV కూడా తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీకి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Read Also: Curry Leaves: కూరలో కరివేపాకుని తీసేస్తున్నారా? అమ్మో.. ఇవన్నీ మిస్ అయినట్లే..!

వాటికన్ సిటీలో..

బుధవారం పవిత్ర వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో 30,000 మందికి పైగా ప్రజలు పాపల్ దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ ప్రత్యేక సమావేశంలో పోప్ లియో XIV యాత్రికులను ప్రబోధించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో, పోప్ లియో XIV ఇండియన్ మైనారిటీ అసోసియేషన్ ప్రతినిధి బృందాన్ని కలిశారు. అక్కడ సార్వత్రిక కాథలిక్ చర్చి ఆధ్యాత్మిక అధిపతి పోప్ లియో XIV.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. రాజ్యసభ ఎంపీ సత్నామ్ సింగ్ సంధు, ఎంపీ, మాజీ దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, ఐఎంఎఫ్ సమన్వయకర్త హిమాని సూద్‌లతో కలిసి ఐఎంఎఫ్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో పోప్ లియో XIV ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ఆశీర్వదించారు. ఎంపీ సత్నామ్ సింగ్ సంధు “హార్ట్ టు హార్ట్: ఎ సాగా ఆఫ్ రెవరెన్స్” అనే పుస్తకాన్ని బహుకరించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిక్కు సమాజం మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది.

Read Also: Bigg Boss Voting: ఓటింగ్ లో దూసకుపోతున్న కమెడియన్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే?

మోదీ స్పందన

కాగా.. దేశ, విదేశాధినేతలు, ప్రముఖుల నుంచి వచ్చిన పుట్టినరోజు శుభాకాంక్షలపై మోదీ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ఆశీస్సులతో తడిసి ముద్దయ్యాను. హృదయాన్ని తాకిన సందేశాలు నాకెంతో బలాన్ని ఇస్తాయి. వ్యక్తిగా నాకు మాత్రమే కాకుండా మెరుగైన భారతదేశ నిర్మాణానికి సాగుతున్న ప్రయత్నాలకు లభించిన ఆశీస్సులుగా వీటిని స్వీకరిస్తున్నా. వికసిత భారత్‌ సాకారానికి మరింత శక్తితో, అంకితభావంతో పనిచేస్తాను. రాష్ట్రపతి సహా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.’ అని మోదీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad