శ్రీచైతన్య విద్యారంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న నేపథ్యంలో తన కిరీటంలో మరో కలికితురాయిని చేర్చుకుంది. ఈసారి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో 2024లో భారత జట్టు అద్భుతమైన ప్రతిభాపాటవాలు ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది.
ఐఎంఓ 2024లో నాలుగు బంగారు పతకాలు..
మనదేశానికి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ) 2024లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు బంగారు పతకాలు ఒక రజిత పతకం, ఒక గౌరవప్రదమైన ప్రస్తావనతో ప్రపంచంలో నాలుగవ ర్యాంకులో నిలిచింది. ఈ ఆరుగురు విద్యార్థుల భారత బృందంలో శ్రీ చైతన్య టెక్నో స్కూలో బావదాన్ పూణేకు చెందిన ఎం వి ఆదిత్య అనే విద్యార్థి అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం. ఇటీవలే బ్రిటన్ లో 65వ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ముగియగా మన బృందం తన సత్తా చాటి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
ప్రధాని అభినందన
ఐఎంఓ 2024లో చారిత్రక విజయం సాధించినందుకు శ్రీచైతన్య విద్యార్థి ఆదిత్య మాంగుడిని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో అభినందించారు. “అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో మనదేశం అత్యుత్తమ ప్రదర్శనతో 4వ స్థానంలో నిలవటం సంతోషించదగ్గ, గర్వించాల్సిన విషయం. మా బృందం 4 స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని ఇంటికి తెచ్చింది. ఈ ఫీట్ ఇతర యువకులందరికీ స్పూర్తినిస్తుంది, గణితంలో మరింత ప్రాచుర్యం పొందటంలో సాయపడుతుంది. ఈ అసాధారణ విజయం దేశానికి గర్వకారణం” అంటూ శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి ఆదిత్యకు, ఇతర విద్యార్థి బృందానికి మోడీ అభినందనలు తెలిపారు.
డైరెక్టర్ సుష్మ-సీమ అభినందనలు
ఈ విజయం సాధించి మనదేశాన్ని ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలబెట్టిన ఆరుగురు విద్యార్థులకు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ, శ్రీచైతన్య స్కూల్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ అభినందనలు తెలిపారు. ఈ ఆరుగురు విద్యార్థుల బృందంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఎం.వి. ఆదిత్య శ్రీచైతన్య టెక్నో స్కూల్ పూణే భావధాన్ విద్యార్థి కావటం తమకెంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఆదిత్య మాంగుడి 6వ తరగతి నుంచే శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థేనని, ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్నాడని, ఐఎంఓ 2024లో బంగారు పతకం సాధించటం వెనుక స్కూల్ స్థాయి నుంచే ఆదిత్య అంకితభావం, కృషి, అసాధారణమైన ప్రతిభ ఉన్నాయని కొనియాడారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనే కాకుండా నాసా, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో సైతం శ్రీచైతన్య విద్యార్థులు సత్తా చాటడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ గుర్తుచేసింది.
23 ఏళ్ల తరువాత..
కాగా 2001లో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ మనదేశం తరపు నుంచి శశాంక్ శర్మ ఏడో స్థానంలో నిలవగా 23 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ లో ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని సొంతం చేసుకున్న మన విద్యార్థి బృందంలో కీలక భూమిక పోషించిన ఆదిత్య శ్రీచైతన్య విద్యార్థి కావటం గర్వంగా ఉందన్నారు.