అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ(PM Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చాయి. అలాగే 26/11 ముంబయి ఉగ్రదాడి సూత్రదారి తహవూర్ హుస్సేన్‌ను భారత్‌కు అప్పగించేందుకుట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే టారిఫ్‌ల విషయంలో మోదీ ముందే తన వైఖరి ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశం భారత్ అని.. ఇకపై అమెరికా కూడా టారిఫ్‌లు విధించడమంలో తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు
ఇక మోదీ మాట్లాడుతూ అక్రమ వలసలు ప్రపంచంలోని ఏ దేశానికైనా సమస్యేనని చెప్పారు. చట్టవిరుద్ధంగా అడుగుపెట్టిన వారికి ఆ దేశంలో ఉండే హక్కు ఉండదని స్పష్టం చేశారు అగ్రరాజ్యంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తామని, ఈ విషయంలో ట్రంప్‌నకు సహకరిస్తామన్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల్లో చాలామంది హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడ్డవారేనని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్వదేశానికి పయనమయ్యారు.