SCO summit: షాంఘై సహకార సదస్సు (SCO Summit)లో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పాల్గొననున్నారు. ఆగస్టు నెల చివర్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సమ్మిట్ కోసమే ఆయన చైనా వెళ్తున్నారు. ఎస్‌సీఓ సదస్సుకు వస్తున్న 20 మంది ప్రపంచ నేతల్లో మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారని శుక్రవారం చైనా వెల్లడించింది. మరోవైపు, చైనా ఆతిథ్యం ఇస్తున్న ఐదో సదస్సు ఇది. ఎస్‌సీఓ చరిత్రలో ఇదే భారీ సమావేశంగా నిలుస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ల్యూ బిన్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Foxconn: ఫాక్స్ కాన్ కీలక నిర్ణయం.. స్వదేశానికి 300 మంది చైనా ఇంజినీర్లు
అమెరికా సుంకాల వేళ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతోంది. ఇలాంటి వేళ.. మోడీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సుంకాలను డ్రాగన్ ఖండించింది. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించింది. ‘‘ఈ వ్యవహారంలో భారత్ వెన్నంటి నిలుస్తాం. ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది’’ అని భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Read Also: Gaza: కరువుతో కొట్టుమిట్టాడుతున్న గాజా.. ఐక్యరాజ్యసమితి ఆందోళన
గల్వాన్ ఘర్షణ తర్వాత..
ప్రధాని మోడీ చైనాలో చివరిసారిగా 2018లో పర్యటించారు. ఆ తర్వాత చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. గల్వాన్ ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా అధ్యక్షుడితో మోడీ భేటీ అయ్యారు.


