Homeఇంటర్నేషనల్PM Modi: రోమ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. జార్జియా మెలోని సెల్ఫీ వైరల్!

PM Modi: రోమ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. జార్జియా మెలోని సెల్ఫీ వైరల్!

PM Modi Italy Tour: భారత ప్రధాని మోదీ ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని స్వయంగా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.

- Advertisement -

కొలోసియం వేదికగా అపురూప దృశ్యం: ఇరు దేశాల ప్రతినిధుల ఉమ్మడి భేటీ అనంతరం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించే.. ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది. రోమ్ నగరంలోని చారిత్రాత్మక కట్టడమైన కొలోసియం ఆంపిథియేటర్(Colosseum Amphitheatre) వద్ద ప్రధాని మోదీతో కలిసి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒక సెల్ఫీ తీసుకున్నారు. అంతర్జాతీయ దౌత్య సరిహద్దులను దాటి ఇరు దేశాల అధినేతల మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి.. పరస్పర గౌరవానికి ఈ ఫోటో ప్రతీకగా నిలిచింది.

Also read-Trump: సమయం మించిపోతోంది.. ఒప్పందానికి రండి: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

సోషల్ మీడియాను ఊపేస్తున్న మెలోని సెల్ఫీ: ఈ అపురూపమైన ఫోటోను ప్రధాని మెలోని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. “వెల్కమ్ టు రోమ్.. మై డియర్ ఫ్రెండ్”(Welcome to Rome, my friend!) అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. గతంలో కూడా వివిధ అంతర్జాతీయ వేదికలపై వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీలు నెట్టింట అత్యంత ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News