Sunday, December 22, 2024
Homeఇంటర్నేషనల్PM Modi: ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం

PM Modi: ప్రధాని మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని(PM Modi) ప్రస్తుతం కువైట్(Kuwait) పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ ముబారక్‌ అల్‌ కబీర్‌’(Order of Mubarak Al Kabeer)తో మోదీని అక్కడి ప్రభుత్వం సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మిశాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా ఈ అవార్డును మోదీకి అందజేశారు. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్‌ ప్రభుత్వం ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

- Advertisement -

కువైట్‌ పర్యటనలో ఉన్న ఆ దేశ ఎమిర్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ట్వీట్‌ చేశారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖాలీద్ అల్-సబాతో భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు నిర్వహించారు. అంతకుముందు బయాన్ ప్యాలెస్‌లో గౌరవ వందనం స్వీకరించారు. కాగా వివిధ దేశాల నుంచి ప్రధాని మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ అవార్డు కావడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News