Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్PM Modi: పుతిన్‌తో భేటీకి ముందు ప్రధాని మోడీకి జెలెన్‌స్కీ ఫోన్ కాల్

PM Modi: పుతిన్‌తో భేటీకి ముందు ప్రధాని మోడీకి జెలెన్‌స్కీ ఫోన్ కాల్

PM Modi Speaks With Zelensky Ahead Of Putin Meeting: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతదేశం ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోంది. ఆ యుద్ధంలో ఏ వైపు ఉండకుండా, మధ్యే మార్గంలో నిలుస్తూ… శాంతి కోసం తనవంతు కృషి చేస్తోంది. అయితే ఇప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సు(SCO Summit)లో పాల్గొనడానికి ముందు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎస్సీఓ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

- Advertisement -

ALSO READ: Putin: డిసెంబర్‌లో భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్!

ఈ సంభాషణలో జెలెన్‌స్కీ తన దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీకి వివరించారు. మరోవైపు, రష్యా మాత్రం కాల్పుల విరమణకు ఏమాత్రం సిద్ధంగా లేదని, అమాయక పౌరులను చంపడం, పౌర లక్ష్యాలపై దాడులు చేయడం కొనసాగిస్తోందని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి సమాధానంగా, “శాంతి, స్థిరత్వం కోసం ఏ ప్రయత్నం చేసినా భారతదేశం పూర్తి మద్దతు ఇస్తుంది” అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సదస్సులో పుతిన్‌తో మాట్లాడేటప్పుడు శాంతి స్థాపన కోసం ప్రయత్నించాలని జెలెన్‌స్కీ కోరగా, మోడీ ఆ విజ్ఞప్తిని స్వీకరించారు.

ALSO READ: India-China relations: చైనాతో భారత్ మైత్రి ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి కీలకం

ఈ పరిణామం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ ఒక కీలక పాత్ర పోషించనుందని సూచిస్తోంది. ముఖ్యంగా, అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారతదేశంపై 25% సుంకం విధించిన తర్వాత కూడా, మోడీ పుతిన్‌తో నేరుగా మాట్లాడనుండటం విశేషం. చైనా అధ్యక్షుడితో కూడా మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనుండటంతో, ఈ సదస్సులో భారతదేశం ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Trump Missing: ట్రంప్ ఎక్కడున్నారు? పబ్లిక్‌లో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ఆందోళనలు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad