Modi: ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సన్నిహితుడు కైక్వీతో భేటీ అయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో పలు కీలక పదవులను నిర్వహిస్తున్న కైక్వీతో.. బీజింగ్‌లోని విదేశీ దౌత్యవేత్తలు ఆయనతో భేటీ కావడానికి ఆసక్తి చూపినా.. చాలావరకు ఆయన వాటికి దూరంగా ఉంటారు. కానీ, ఇటీవల ప్రధాని మోదీ చైనా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) స్వయంగా కైక్వీని రంగంలోకి దింపారు. భారత ప్రధానితో ఇరుదేశాల సంబంధాలపై చర్చించాలని సూచించారు. ప్రధాని మోదీ-కైక్వీ మధ్య దాదాపు 45 నిమిషాలపాటు సమావేశం జరగడం తింజాయన్ దౌత్యవర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈసందర్భంగా ప్రధాని తన ఆలోచనలను ఆయనతో పంచుకొన్నారు. ఎస్‌సీవోలో పాల్గొన్న ఏ దేశ నాయకుడినీ ఆయన బహిరంగంగా కలవలేదు. కానీ, మోదీ(PM Modi)-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీకి మాత్రం హాజరయ్యారు. ఇరుదేశాల సంబంధాలు వేగంగా సాధారణ స్థితికి చేరడానికి ఈ భేటీ దోహదపడుతుందని నమ్ముతున్నారు. చైనాలోని భారత వ్యతిరేక వర్గాలకు ఈ భేటీ బలమైన సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు. ఇకపోతే, చైనా (China) కమ్యునిస్టు పార్టీలో కైక్వీ చాలా కఠినమైన వ్యక్తి. అసలు నవ్వడు అనే పేరుంది. అతడు అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) కు కుడిభుజం అని పార్టీ వర్గాలు చెబుతుంటాయి.
Read Also: Kim Jong Un: ప్రత్యేక రైలులో చైనాకు కిమ్..!
కైక్వీ ఎవరంటే..?
కైక్వీ ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్‌లో ఫస్ట్‌ర్యాంకింగ్ హోదా, పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అన్నింటికీ మించి జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చీఫ్ ఆఫ్ స్టాఫ్. మావో యుగం తర్వాత ఈ రెండు పదవులు ఏకకాలంలో చేపట్టిన వ్యక్తి ఆయనే. చైనాలోని అధికార క్రమంలో ఐదో స్థానంలో ఉన్నారు. ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన కై, షీ జిన్‌పింగ్ (Xi Jinping) ను 1980ల్లో తొలిసారి కలిశారు. ప్రస్తుతం ర్యాంకులు ఎలాఉన్నా.. చైనా ప్రీమియర్ లి క్వియాంగ్‌తో సమానంగా ఆయన మాట చెల్లుబాటవుతుంది. పార్టీలో తెలివైన వ్యక్తిగా.. అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరుంది. గతంలో సోషల్ మీడియాలో ఆయనకు కోటి మంది ఫాలోవర్లు ఉండేవారు. జిన్‌పింగ్ (Xi Jinping) అధ్యక్ష పదవి చేపట్టాక దానిని ఆయన పక్కనపెట్టారు. దీంతోపాటు ఆయన బయట కనిపించడం కూడా అరుదుగా మారింది. ఆ తర్వాత చాలా వేగంగా పోలిట్ బ్యూరోలోకి వెళ్లారు. జిన్‌పింగ్‌ను బహిరంగానే మావోతో పోల్చిన తొలి నాయకుడు ఆయనే.
Read Also: ODI: ఒక్కసారి కూడా డకౌట్ కానీ టీమిండియా ప్లేయర్ ఎవరంటే?


