రోమన్ కాథలిక్ ప్రపంచానికి విషాదాన్ని మిగిలిస్తూ పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆయన 2013లో పోప్‌గా ఎన్నికై, 12 సంవత్సరాల పాటు రోమన్ కాథలిక్ చర్చిని నడిపించారు. అయితే ఈ అంత్యక్రియలు మాత్రం ఇప్పటి వరకు జరిగినవాటిలా కాకుండా, ఆయన సూచించిన మార్గంలోనే జరుగనున్నాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ, అయితే వాటిలో మితమైన మార్పులు చేస్తూ, మరణానంతర కార్యక్రమాలను ఆయన ముందుగానే రూపుదిద్దారు.
సాధారణంగా పోప్ అంత్యక్రియలు భిన్నంగా, అత్యంత ఘనతతో నిర్వహించేవారు. సైప్రస్ చెట్టు, సీసం, సింధూర వృక్షం వంటి విలువైన పదార్థాలతో.. మూడు పొరల శవపేటికలు సిద్ధం చేసి అందులో పోప్ దేహాన్ని ఉంచుతారు.. కానీ కానీ పోప్ ఫ్రాన్సిస్ మాత్రం తన అంత్యక్రియలు సాధారణంగా, సాదాసీదాగా జరగాలని కోరుకున్నారు. దీంతో గొప్ప శవపేటిక స్థానంలో.. సింపుల్ శవ పేటికను తయారు చేస్తున్నారు. దీనిని ప్రత్యేకమైన జింక్ ఖనిజంతో తయారు చేస్తున్నారు.
పోప్ పార్ధీవ దేహాన్ని వాటికన్ సిటీలోని ప్రసిద్ధ సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ఉంచుతారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ఎత్తయిన స్థలమైన ‘కాటాఫల్క్’ పై శవపేటిక ఉంచుతారు. ప్రజలు ఆయనకు తుదిసారి చూసి నివాళులు అర్పిస్తారు. ప్రజల సందర్శనార్ధం శవపేటికపై పైకప్పు తీసి ఉంచుతారు. ఇక మరో ప్రత్యేక అంశం ఏమిటంటే, పోప్ ఫ్రాన్సిస్ ఖననం మాత్రం వాటికన్‌లో కాకుండా, రోమ్ నగరంలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో జరుగనుంది. గత శతాబ్ద కాలంలో రోమన్ కాథలిక్ మతగురువును ఇతరచోట ఖననం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సాధారణం పోప్ మరణానంతరం ఎంతో ఘనంగా సాగనంపుతారు.. అయితే పోప్ ఫ్రాన్సిస్ మాత్రం.. జీవితంలోనూ, మరణానంతర కార్యక్రమాల్లోనూ వినయాన్ని ప్రదర్శించారు. ఆయన మార్గదర్శకత్వం, మానవతా దృక్పథం, సామాజిక న్యాయం కావాలనుకున్నారు.